అమెరికాలో ఈ మద్య జాత్యహంకారం విపరీతమవుతుంది. తమ దేశంలోకి వచ్చి తమకు పోటీగా ఉంటున్నారి భారతీయులపై హత్యలకు తెగబడుతున్నా అక్కడి వారు.  తాజాగా అమెరికా జాత్యాహంకారంతో ఉగ్రవాదులని సంభోదిస్తూ.. ఓ తెల్లజాతి దుండగుడు ఇద్దరు తెలుగు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల ఘటనలో ఓ తెలుగు ఇంజినీర్ మరణించారు. మృతుడిని శ్రీనివాస్‌ కూచిబొట్ల(హైదరాబాద్ వాసి)గా గుర్తించారు. మరో తెలుగు వ్యక్తి అలోక్‌ మాదసాని(వరంగల్ వాసి) తీవ్రంగా గాయపడ్డారు.
Image result for టాగ్లు: shooting in america kansas,
బుధవారం రాత్రి కాన్సస్ రాష్ట్రంలోని ఓలెత్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్‌’లో తెలుగువారైన శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలతో ఆడమ్ ప్యూరిన్టన్ అనే వ్యక్తి ‘మీరు నాకంటే ఎందులో గొప్పో’ చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో తాగిన మత్తులో ఉన్న ప్యూరిన్టన్ ను బార్ సిబ్బంది బయటకు పంపించేశారు. కొద్దిసేపు తర్వాత ప్యూరిన్టన్ తుపాకితో ఎంటర్ అవుతూనే   శ్రీనివాస్, అలోక్‌ లపై కాల్పులు జరిపాడు.  కాల్పులు జరిపే ముందు  ‘మా దేశం వదిలిపోండి.. టెర్రరిస్ట్’ అని అరిచాడని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Image result for Srinivas Kuchibhotla, Alok madasani
కాల్పులు జరుపుతున్న ప్యూరిన్టన్‌ను అడ్డుకునేందుకు ఇయాన్ గ్రిల్లోట్ అనే అమెరికన్ ప్రయత్నించడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. అతడి చేయి, భుజంలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ గార్మిన్ కంపెనీ ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ టీంలో పనిచేస్తున్నట్టు సమాచారం. కాల్పుల ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ బార్‌లో దాక్కునేందుకు ప్రయత్నించిన ప్యూరిన్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Image result for Srinivas Kuchibhotla, Alok madasani


మరింత సమాచారం తెలుసుకోండి: