తెలంగాణా లో తిరుగులేదు అనుకున్న కెసిఆర్ కి ఇప్పుడు కొత్త తలనొప్పులు కనపడుతున్నాయి. దాదాపు పది సంవత్సరాల పాటు కెసిఆర్ దే పాలన కొనసాగుతుంది అని నిపుణులు మొన్న మొన్నటి వరకూ అంచనా వేసినా ఇప్పుడు కెసిఆర్ కోదండరాం విషయం లో వేసిన సెల్ఫ్ గోల్ తో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒకటి అయినట్టుగా ఉన్నాయి. కెసిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అని కాంగ్రెస్ పెద్ద కోమటి రెడ్డి , రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.


ప్రజలకి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసిన ఇక్కడి ప్రభుత్వం ప్రజల నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి సిద్దంగా ఉండాలి అని వారు అంటున్నారు. దాదాపు ఎనిమిది కిలోమీటర్ ల బైకు ర్యాలీ ని కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన వారు కెసిఆర్ ప్రజలకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసారు అని చెప్పుకొచ్చారు.


కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ తాము త్వరలోనే పాదయాత్ర చేపడుతామని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రకటించారు. కాగ ఇప్పటికే సీపీఎం ఆధ్వర్యంలో కేసీఆర్ పరిపాలన వైఫల్యాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కాంగ్రెస్ న బలోపేతం చేస్తూ తెరాస ని ఖాళీ చేసే దిశగా తమ పాదయాత్ర జరుగుతుంది అని వారు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాము దాదాపు 100 సీట్లు అయినా గెలవాలి అనుకుంటున్నాం అని వారు శపథం చేసారు.


కోదండరాం ని అక్రమంగా అరస్ట్ చెయ్యడం తెరాస ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు అనీ ఉద్యమాల ద్వారానే ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఇలా చెయ్యడం హేయమైన చర్య అంటూ వారు సీరియస్ అయ్యారు. లక్ష ఉద్యోగాలిస్తామని ఇవ్వకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులు మళ్లీ ఉద్యమబాట పట్టడానికి కేసీఆర్ కారణమయ్యారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: