మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే బుధవారం తన నియోజకవర్గానికి చెందిన మహిళకు స్వయంగా ఆపరేషన్‌ నిర్వహించారు. మిజోరంకి చెందిన 52 ఏళ్ల ఎమ్మెల్యే బీచువా తన తొలి వృత్తి ధర్మాన్ని పాటించి మహిళ ప్రాణం నిలబెట్టారు. సైహా జిల్లా ఆసుపత్రిలోని సర్జన్‌ శిక్షణ కోసం ఇంఫాల్‌కు వెళ్లారని.. అదే సమయంలో ఓ మహిళ(35) తీవ్ర కడుపునొప్పితో అక్కడి వచ్చినట్లు తనకు తెలిసిందని ఎమ్మెల్యే డా. కే బిచ్‌హువా తెలిపారు.


ఎమ్మెల్యే డాక్టర్‌గా మారి.. ఆదుకున్నారు

కడుపు నొప్పితో బాధపడుతున్న మహిళకు వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకొని శస్త్ర చికిత్స చేశానని ఆయన అన్నారు. గురువారం ఆమెను ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని జిల్లా అభివృద్ధి సమావేశంలో ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకువచ్చినట్లు డిప్యూటీ కమిషనర్‌ చెప్పారు. బిచ్‌హువా 2013లో సైహా నియోజకవర్గం నుంచి మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) తరఫున పోటీ చేసి గెలుపొందారు.



డాక్టర్‌ బీచువా ఇంఫాల్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. 20 సంవత్సరాలపాటు వైద్య వృత్తి కొనసాగించిన ఆయన వందలాది శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. 2008లో రాజకీయ ప్రవేశం చేసిన బీచువా తర్వాత మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) పార్టీలో చేరి 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: