తమిళనాడులో రాజకీయ గందరగోళం ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయంతిని అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు అమ్మ 69వ జయంతిని వేర్వేరుగా నిర్వహించుకున్నాయి. శుక్రవారం వేర్వేరుగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాయి. అన్నాడీఎంకే శశికళ వర్గీయులు, రెబల్ నేత పన్నీర్ సెల్వం వర్గీయలు వేర్వేరుగా అమ్మ జయంతి నిర్వహించడం విశేషం.  అయితే మొన్నటి వరకు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చింది.

తాజాగా పన్నీర్‌ సెల్వంతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతానని ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది. అంతే కాదు  జయకు అసలైన వారసురాలిని తానే అని చెప్పిన దీప అమ్మ ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత మేనకోడలు దీపా జయకర్ మెరీనా బీచ్‌కు వెళ్లి అమ్మ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆర్కె నగర్‌లో పన్నీర్ సెల్వం వర్గం..
చెన్నైలోని ఓ అనాథాశ్రమంలో పిల్లలకు అల్పాహారం అందజేశారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతుదారులు విడిగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.  కాగా పన్నీర్ సెల్వం మద్దతుదారులు జయలలిత నియోజకవర్గమైన ఆర్.కె.నగర్‌లో సమావేశమై అమ్మ జయంతి జరిపారు. నియోజకవర్గ ప్రజలకు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇతర సామగ్రిని పన్నీర్ సెల్వం శిబిరం అందజేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: