ఏపీలో అంతా హైటెక్ పాలన సాగుతోంది. టెక్నాలజీని వాడుకుని దూసుకుపోతున్నాం.. అంతా పారదర్శక పాలన.. సాంకేతికతను వాడుకుని అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాం.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.. ఇవీ చంద్రబాబు సాధారణంగా వినిపించే ప్రెస్ మీట్ కబుర్లు.. ఇదంతా వింటే నిజంగానే ఏపీలో అవినీతి అంతమైపోయిందని భావించాల్సి వస్తుంది. 


కానీ అసలు సీన్ వేరే ఉందట. దాన్ని చూసి చంద్రబాబే షాకవుతున్నారట. ఆంధ్రా ప్రభుత్వ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోతోందట. ప్రత్యేకించి రెవెన్యూ శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరిందట. సాక్షాత్తూ చంద్రబాబే ఈ అవినీతి రేంజ్ చూసి అవాక్కవుతున్నారట. తాను రెవెన్యూ శాఖలో సంస్కరణలు తేవాలని చెబుతుంటే.. రెవెన్యూ అధికారులు మాత్రం అవినీతితో ప్రజలకు దూరం అవుతున్నారని ఆయన అంటున్నారు. 



తాజాగా సెక్రటేరియట్ లో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారులోని ఇతర శాఖలు సాంకేతికంగా ముందుకు వెళుతుంటే రెవెన్యూ శాఖ వెనుకబడుతోందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అదికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


రెవెన్యూ అధికారులు మాత్రం తాము.. శాఖాపరంగా సంస్కరణలు తెచ్చామని, టెక్నాలజీని వాడుతున్నామని సమీక్ష సమావేశంలో చెప్పారట. ఆ మేరకు ఓ నివేదిక కూడా సమర్పించారట. కానీ దాంతో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. అవినీతి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భీమిలి తహశీల్దార్ అవినీతి నిరోదక శాఖకు పట్టుబడిన వైనాన్ని గుర్తు చేశారు. మరి రెవెన్యూ శాఖ అవినీతిని అరికట్టే సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు సర్కారు ఇంకా రూపొందించలేదేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: