తమిళనాడులో ఇప్పుడు కొత్త పార్టీ పుట్టుకొచ్చింది.  గత కొంత కాలంగా తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో నమ్మకంగా ఉన్న పన్నీరు సెల్వం, శశికళ ల మద్య అంతర్యుద్దం అయిన సంగతి తెలిసిందే.  తమిళనాడు సీఎం కోసం ఇద్దరు విపరీతమైన పోరాటం చేశారు..కానీ తానొకటి తలిస్తే..దైవం ఒకటి తలిచినట్లు..సీఎం పీఠం మాత్రం మూడో వ్యక్తి వచ్చి తన్నుకెళ్లాడు.  అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం ఆ పదవికి రాజీనామా చేయగా సీఎం సీటు కోసం ఆశపడ్డ శశికళ జైలుకెళ్లింది.  

దీంతో శశికళకు ఎంతో నమ్మికగా ఉన్న పళని స్వామిని అన్నాడీఎంకే శాసన సభా పక్షనేతగా ఎన్నుకోవడం..వెంటనే ఆయన గవర్నర్ ని కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గత శనివారం బల నిరూపణలో కూడా నెగ్గడంతో ప్రస్తుతం తమిళనాడు సీఎం గా పళనిస్వామి కొనసాగుతున్నారు.  కాగా మొదటి నుంచి శశికళ వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్  ఇంతకుముందు ప్రకటించినట్టుగా  కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ‘ఎంజీఆర్ అమ్మ దీప పెరవై’ అని పేరు పెట్టారు.  

జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేశారు.  టినగర్ లోని తన నివాసంలో పార్టీ జెండాను దీప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నియమ నిబంధలను కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని ఆమె చెప్పారు. మాజీ సీఎం పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని దీప తెగేసి చెప్పారు. జయలలితకు తానే అసలైన వారసురాలినన్న దీప.. ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జయలలిత అభిమానులు తనను కోరుతున్నారన్నారు. పళనిస్వామి ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి కాదని దీప విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: