• ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ..అని రాసాడో తెలుగు కవి.. కేవలం డబ్బు మోహంలో పడి ప్రాణాలను సైతం పణంగా పట్టి పరాయి దేశాలకు పయనమవుతున్న భారతీయులారా మీకిదే మా సందేశం..

  • ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంమైన మన భారత దేశంలో అవకాశాలకు కొదువులేదు. సరైన క్రమంలో ఆలోచిస్తే.. ఎన్నో అవకాశాలు, మరెన్నో సరికొత్త ఆలోచనలు మన తలుపు తడతాయి. అయినా వాటన్నింటినీ పక్కనబెట్టి కన్న తల్లిదండ్రులను, కన్న తల్లి లాంటి దేశాన్ని వదిలి, పరాయి దేశాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతకడం అవసరమా...? ఒక్క సారి ఆలోచించండి.
  • డబ్బుపై ఉన్న విపరీతమైన మోజు తో పరాయి దేశాలకు పయనం అవుతున్నారే.. మన దేశంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించే ఉద్యోగాలు గానీ, అవకాశాలు గానీ లేవా..అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే సమాధానం ఉన్నాయనేదే విస్పష్టం. అలాంటి అవకాశాలే లేకపోతే.. ఎన్నో విదేశీ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు ఎందుకు పెట్టేవి...? కోట్లకు ఎందుకు పడగలేత్తేవి...?
  • డబ్బేనా మనిషికి జీవితం...? అవసరానికి సరిపడా డబ్బు సరిపోదా...? పాశ్చాత్య పోకడితో కేవలం ఒకటీ, రెండేళ్లలో కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశతో పరాయి దేశాలకు పయనమవుతున్నారే.. పరాయి దేశాల్లో ఏదైనా జరగకూడనిది జరిగితే.. అప్పుడు వారికి దిక్కెవరు...? ఆంధ్రా వాళ్లు తెలంగాణ వారి ఉద్యోగాలను దోచుకున్నందుకే వారు ప్రత్యేక తెలంగాణ ను కోరుకున్నారు. అలాగే అమెరికన్ల ఉద్యోగాలను పరాయి దేశం వారు దోచుకుంటున్నందుకే ఇలాంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
  • ఉత్తర భారతంతో పోల్చుకుంటే దక్షిణ భారతంలోనే పరాయి దేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు వారిలో మన దేశంలో కంటే పరాయి దేశంలో పనిచేయడమంటే విపరీతమైన క్రేజ్. అదేంటే ఆ దిక్కుమాలిన అలవాటు మన వారికే అబ్బింది. ఇప్పటికైనా ఒక్క సారి ఆలోచించండి.. విదేశాల్లో అతిగా డబ్బు సంపాదించడం ముఖ్యమా..? సంపాదించిన దాంతో మన దేశంలో ఆనందంగా ఉండడం ముఖ్యమా...?

మరింత సమాచారం తెలుసుకోండి: