తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం– ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో గృహనిర్మాణశాఖ చేపట్టిన జాయిం ట్‌ వెంచర్లలో అవినీతికి పాల్పడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సొంత ఊరిలోనే పేదలకు ఇళ్లు కట్టించలేని ఆయన రాష్ట్రమంతా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎలా నిర్మిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.


ఇంద్రకరణ్‌ను మంత్రి పదవినుంచి తప్పించాలి

గత ప్రభుత్వాలు కూకట్‌పల్లి, గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మం తది తర ప్రాంతాల్లో ప్రారంభించిన జాయింట్‌ వెంచర్లలో 10%గృహాలను పేదలు, అల్పాదాయ వర్గాల కోసం నిర్మించాలని అప్పట్లోనే ఒప్పందం జరిగిందన్నారు. అయితే ఈ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించాలని ప్రైవేట్‌ సంస్థలు ఒత్తిడి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వాలు పేదలకు అన్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ఇంద్రకరణ్‌ ఎల్‌ఐజీ ఇళ్లను తొలగించి పేదలకు తీరనిద్రోహం చేశారన్నారు.


నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై!

దీనిపై  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ..మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు.. ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. డబుల్‌ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. మిషన్‌ భగీరథ పథకం వల్ల ఆలస్యం జరుగుతున్నదని, ఇక ముందు ఆలస్యం జరగనివ్వబోమని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: