మొహమాటం లేకుండా ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం అవసరమైనా కాకున్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరొందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి మరియు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కారదర్శి శశికళను జైలుపక్షిగా సంబోధిస్తూ, ఆమె చేతిలో కీలుబొమ్మగా పళనిస్వామిని అభివర్ణించారు.


palaniswamy images కోసం చిత్ర ఫలితం



తమిళులు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించడాన్ని తప్పుపడుతూ, ఇది అవమానకరమని అన్నారు. కట్జూ తమిళు లను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


palaniswamy images కోసం చిత్ర ఫలితం


'జైలుపక్షికి కీలుబొమ్మ తమిళనాడు సీఎం అయ్యారు. మీరు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. మీరు మహావీరులైన చోళు లు, పాండ్యుల సంతతికి చెందినవారు. తిరు వళ్లువర్, ఇళంగో, కంబార్, అండాల్, సుబ్రహ్మణ్య భారతి వారసులు. మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. నేను తమిళుడని చెప్పేందుకు గర్వం గా భావిస్తాను. ఇప్పుడు ఈ ముఖంతో ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడం తమిళులకు కళంకం. ఆయన పదవిలో ఉంటే నేను తమిళుడిగా ఉండ లేను. అవమానంతో, అగౌరవంతో బతకరాదు. దీనికంటే చావడం మేలు' అని కట్జూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

sasikala in jail palaniswamy images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: