ఔను.. ఆంధ్రా నిరుద్యోగులు ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది. గ్రూప్ 2 పరీక్ష ఈ రోజు జరగబోతోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ ఈ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకోవాలి. 9:45 లోపే లోనికి అభ్యర్థి పరీక్ష హాలు లోపలికి వెళ్లిపోవాలి.

group two exam appsc కోసం చిత్ర ఫలితం

అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. ఆధార్‌ కార్డు, ఓటరు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్ పోర్టు వంటి వాటిని విధిగా చూపాలి. పరీక్ష ప్రారంభమయ్యాక  ఒక్క సెకను ఆలస్యం అయినా లోనికి అనుమతించరు. హాల్‌ టికెట్‌పై ఫొటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి మూడు పాస్‌ పోర్టు ఫొటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. 

group two exam appsc కోసం చిత్ర ఫలితం
మొత్తం ఆరు లక్షల 57వేల మంది అభ్యర్ధులకు గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు మొత్తం 442 ఎగ్జిక్యూటివ్‌, 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఆదివారం స్క్రీనింగ్‌ టెస్టు జరగుతుంది. శనివారం సాయంత్రం వరకూ ఐదున్నర లక్షల మంది అభ్యర్ధులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1,376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్‌ లోనూ ఏర్పాటు చేశారు.

group two exam appsc కోసం చిత్ర ఫలితం
ఎగ్జిక్యుటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అతిపెద్ద ప్రకటన ఇదే. అంతే కాదు.. ఏపీపీఎస్సీ ఫస్ట్ టైమ్ గ్రూప్-2 పరీక్షను తొలిసారిగా రెండు దశల ద్వారా స్క్రీనింగ్ విధానంలో నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్-2 పరీక్షలో ఒక్కో పోస్టుకు 670 మంది పోటీ పడుతున్నట్టు అంచనా. 



మరింత సమాచారం తెలుసుకోండి: