ఏపీ సర్కారు అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని కలలు కంటోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తోంది. కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యింది. సింగపూర్ తో పాటు అనేక దేశాల సహకారం తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు బాహుబలి దర్శకుడు రాజమౌళి గుర్తొచ్చాడు. 


మాహిష్మతి సామ్రాజ్యను అమరావతి నిర్మాణానికి సలహాలు ఇవ్వమని కోరారు. మావాళ్లు వస్తారు.. వారిని గౌడ్ చేయండి అంటూ చంద్రబాబు స్వయంగా అడిగే సరికి రాజమౌళి కాదనలేకపోయాడు. ఐతే.. చెప్పిన ప్రకారమే మంత్రి నారాయణ సహా అమరావతి ప్రతినిధులు రాజమౌళిని కలిశారు. డిజైన్ల గురించి చర్చించారు. 


అప్పుడు రాజమౌళి అనూహ్యమైన షాక్ ఇచ్చేశాడు. తనకేమీ తెలియదని.. తాను ఓ కొత్త నగరానికి రూపకల్పన చేయలేనని చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి ఇటీవల విడుదల చేసిన ఓ టీజీర్ ఇస్తున్న సందేశమిది. రాజధాని నిర్మాణానికి మొదట తాను పనిచేయలేనని రాజమౌళి చెప్పేశారట. కానీ ఏపీ మంత్రులు, అధికారులు వదిలితే కాదా.. 


అందుకే రాజమౌళి తాను మాహిశ్మతిని ఎలా నిర్మించిందీ చెప్పేందుకు రెడీ అయ్యారు. బాహుబలి రెండో భాగంపై మీడియాకు ఇచ్చిన ముఖాముఖీలో అమరావతి రాజధాని నిర్మాణంపై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. బాహుబలిలో మహిష్మతి రాజ్య నిర్మాణానికి కొన్ని విధానాలు పాటించామని, ప్రజా పరిపాలనకు అనువుగా ఉండే అమరావతి నిర్మాణంలోనూ ఆ విధానం పాటిస్తే తాను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జక్కన్న ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: