ఐపీఎస్ ఆఫీసర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియని వారు ఉండరు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సమయంలో ఆయనకు లభించిన ఖ్యాతి అంతా ఇంతా కాదు.. అవినీతిపరుల పాలిటి సింహ స్వప్నం.. అనీ.. నిక్కచ్చి ఆఫీసర్ అని.. నిజాయితీకి మారు పేరు అని.. ఇలా అప్పట్లో మీడియా ఆయనకు చాలా ప్రాచుర్యం కల్పించింది. 


ఐతే.. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో అసలు జరిగిందేంటి.. అక్రమాస్తుల కేసులో కేవలం జగన్ ను మాత్రమే ఎందుకు విచారించారు.. అసలు విచారణకు ఎవరెవరిని పిలుస్తారు.. ఫలానా వాళ్లనే విచారించాలని కోర్టు చెబుతుందా.. ఇలాంటి ప్రశ్నలు అప్పట్లో ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రమాకాంత రెడ్డి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను అడిగారుట. జగన్ పై కేసుల విచారణ సందర్భంగా అప్పటి సీఎస్ రమాకాంతరెడ్డిని కూడా సీబీఐ పిలిపించి విచారించింది. ఈ సందర్భంలోనే ఆయన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణను అడిగారట.. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా?’ అని లక్ష్మీనారాయణను అడిగారట.

Image result for cbi jd lakshmi narayana

అందుకు ఆయన సీబీఐ జేడీ ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారట. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌. ఫలానా వాళ్లను ఇంటరాగేట్‌ చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీసులను రెయిడ్‌ చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్‌ చేయాలని హైకోర్టు చెబుతుందా?’ అని రమాకాంతరెడ్డి రెట్టించి అడిగారట. 



దానికి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ.. ‘అబ్బో వద్దండి... అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారట. దీంతో అసంతృప్తి చెందిన రమాకాంత రెడ్డి ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్‌ మీద నాకు నమ్మకం లేదండి.. నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పి వచ్చేశారట. మరి దీన్ని బట్టి చూస్తే అప్పట్లో సీబీఐ జేడీ తనకు తానుగా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపించదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: