తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోయెస్‌ గార్డెన నుంచి జయలలితని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు ఆమె అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆమెకు చికిత్స జరుగుతున్న ప్రాంతానికి ఇతర డాక్టర్లను అనుమతించలేదు. దాంతో జయ మృతిపై బలమైన అనుమానం కలుగుతోంది’’ అని అపోలో ఆస్పత్రిలో పని చేసే డాక్టర్‌ సీత వ్యాఖ్యానించారు.


జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. డాక్టర్‌ సీత కొద్ది రోజుల కిందట జయ సోదరుడి కుమార్తె దీపను కలుసుకుని ఆమెకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంను కలుసుకుని ఆయనకు కూడా మద్దతు తెలిపారు. జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్లో జరిగిన బహిరంగ సభలోనూ ఆమె ఇటువంటి ఆరోపణలు చేశారు.



ఇంటి నుంచి అపొలో ఆస్పత్రికి వచ్చే సమయంలో జయలలితకు స్పృహ కూడా లేదని, ఆమె వెంట బంధువులు ఎవ్వరూ రాలేదని పేర్కొన్నారు. జయలలిత చికిత్స పొందిన ప్రత్యేక గది వైపు ఏ ఒక్క డాక్టర్నీ అనుమతించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, డాక్టర్‌ సీతపై అపోలో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, సైబర్‌ క్రైం పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు. ఎగ్మోర్‌ కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం ఆమెకు 15 రోజులపాటు రిమాండ్‌ విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: