ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక అనుసంధాన వేదికలు కొందరు దుర్మార్గులకు బెదిరింపు సాధనాలుగా మారాయి. మీ ప్రైవేటు  చిత్రాలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్టు చేయకపోతే ఫేస్ బుక్ లో పెడతా వంటి బెదిరింపుల ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా ఇలాంటి నేరగాళ్లు పెరిగిపోయారు. 



తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. మీ అమ్మ నగ్న చిత్రాలు, వీడియోలు నా వద్ద ఉన్నాయంటూ ఓ 21 ఏళ్ల యువకుడు ఓ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. అర్జంటుగా తన చేతిలో లక్ష రూపాయలు ఉంచకపోతే.. ఈ చిత్రాలు ఫేస్ బుక్, వాట్సప్ లలో విస్తృతంగా ప్రచారం చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. 


ఆ బెదిరింపులు తాళలేక ఆ యువతి చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగింది. నిందితుడు రవి, బాధితురాలు ఒకే ప్రాంతానికి చెందినవారు. బాధితురాలి తండ్రి ఇదివరకే చనిపోయాడు. తల్లీ కూతురు ఆ ప్రాంతంలో ఉంటున్నారు. 

Image result for woman suicide graphic

దీన్ని సాకుగా తీసుకున్న రవి.. బాధితురాలిని వేధించడం మొదలు పెట్టాడు. కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు వెంటపడటం ప్రారంభించాడు. చివరకు మీ అమ్మ నగ్నచిత్రాలు తనకు చిక్కాయని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులు చివరకు బాధితురాలి ఆత్మహత్యకు దారి తీశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: