ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికార పక్షం అయిన తెలుగు దేశానికి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతి నిత్యం ప్రశ్నిస్తున్న రాజకీయ నాయకుడు యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి.  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జిల్లా (పాత పేరు కడపజిల్లా) లో పులివెందుల గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి తన ప్రారంభ విద్యనభ్యసించారు.  
Image result for ysrcp
చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరిగిన జగన్ తండ్రి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చారు.  అంతకు పూర్వం వ్యాపారం రంగంలో ఉండే వారు.  తండ్రి మరణాంతరం 2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని మొత్తం ప్రాంతీయ పార్టీల్లో ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించి ఈ పార్టీ రికార్డు సృష్టించింది.
Image result for ys jagan family
ఈ ఎన్నికలలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో ఈ పార్టీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించి రికార్డు సృష్టించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: