పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ నిన్నా ఇవాళా జరిగింది కాదు. 2009 లోనే యమా ఆవేశంగా కళ్యాణ్ పొలిటికల్ వరండా లోకి అడుగు పెట్టేసాడు. హీరోగానే ఉంటూ తన అన్న ప్రజారాజ్యం పార్టీ కోసం యువతని ఆకట్టుకునే పనిలో యువరాజ్యం హెడ్ గా వచ్చి తన ఆవేశం చూపించాడు. పవన్ రాజకీయాలలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇతనికి ఆలోచన కంటే అవేశమే ఎక్కువ అనేసారు పొలిటికల్ నిపుణులు. కానీ ఆ ఆవేశం లో నిజాయితీ కనిపించేసరికి యువత అతనివైపు బాగానే ప్రభావితం అయ్యారు.


నెమ్మదిగా కనక్ట్ కూడా అయ్యారు .. కానీ పవన్ కి ఇష్టం లేని ఎన్నో వ్యవహారాలు పార్టీలో నడిచాయి. ఆ పార్టీ పోటీ చేసిన తీరు, టికెట్ లు ఇచ్చిన తీరు, ఓడిపోయిన విధానం గురించి పార్టీ వ్యవస్థాపకుడు చిరు ఏమి నేర్చుకున్నాడో మనకి తెలియదు కానీ పవన్ కి మాత్రం చాలానే తత్వం బోధ పడింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపెయ్య్యడం తో సైలెంట్ అయిపోయిన పవన్ , తెలంగాణా ఉద్యమం టైం లో కూడా ఏమీ మాట్లాడలేదు. రెండు రాష్ట్రాలూ విడిపోయి అదే టైం లో వచ్చిన కీలక ఎన్నికలకి పవన్ పెద్ద దిక్కుగా నిలిచాడు.


ముఖ్యంగా టీడీపీ - బీజేపీ పార్టీలకి అండగా నిలిచిన పవన్ , సీమాంధ్రప్రజల ఆవేదనను సినిమాటిక్ డ్రామా పదాలతో అద్భుతంగా ఆవిష్కరించి ప్రజల మన్ననలు పొందాడు. టీడీపీ లాంటి మీడియా సపోర్ట్ ఉన్న పార్టీ కి పవన్ దిక్కు అవ్వడం తో అతనికి ఎక్కడ లేని మీడియా కవరేజీ సపోర్ట్ లభించింది. ఆ బలం తో పవన్ కి జై కొట్టేసారు జనం. 2009 లో అతను ప్రచారం చేసిన ప్రజారాజ్యం కానీ, కొందరు ఎమ్మెల్యే లు గానీ అట్టర్ ప్లాప్ అయిన విషయం ఈ దెబ్బతో జనం నెమ్మదిగా మర్చిపోయారు. పదవులు తనకి లెక్క కాదు అని ఓపెన్ గానే చెబుతూ త్యాగమూర్తి బ్రాండ్ ని కూడా పవన్ సంపాదించాడు. 2014 ఎన్నికల లెక్కలో అందరికంటే , చివరికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కంటే పవన్ కే ఎక్కువ మార్కులు వేసారు జనాలు. కానీ అధికారం లో ఉన్న ఎవ్వరినైనా ప్రశ్నిస్తా అనే మాట మోడీ - చంద్రబాబు ల మీద గురి పెట్టకుండా పవన్ సైలెంట్ అయిపోయాడు. బీజేపీ - టీడీపీ తో అతనికి ఉన్న స్నేహానికి నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా పవన్ పొలిటికల్ మూవ్ లే వెయ్యడం అందరికీ చిరాకు తెప్పించింది. అలా ఓర్పు పట్టీ పట్టీ బీజేపీ కి కో చెప్పేసి వారితో వైరం తెచ్చుకున్నాడు. టీడీపీ తో కూడా గొడవ పడితే తన కొత్త పార్టీ కి పునాదులు కూడా ఉండవు ఏమో అని సైలెంట్ గా ఉన్నాడు కావచ్చు.


చంద్రబాబు తప్పులని విమర్శించే విషయంలో మొదటి నుంచీ లౌక్యం ప్రదరిస్తున్నాడు కళ్యాణ్. ఇదే రాజకీయాన్ని 2019లో కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ చేస్తాడు అంటున్నాయి అతని దగ్గరి సోర్సెస్. 2019 వరకూ కూడా పోరాటాలు చేస్తూ టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రజలకి దూరం అవ్వకుండా తనని తాను కాపాడుకుంటూ నెమ్మదిగా తన అన్న నాగబాబు ని రంగంలోకి దింపి మిగితా వ్యవహారాలు చక్కబెట్టాలని కళ్యాణ్ చూస్తున్నాడు అంటున్నారు. ఇలా కంటిన్యూ అవుతూ టీడీపీ కి తానే సరైన ప్రత్యామ్న్యాయం అంటూ కొన్ని సీట్ లకి పోటీ చేస్తాడట.


ఈ గేమ్ ప్లాన్ తో 2019 ఎన్నికల రణరంగంలో ప్రతిపక్ష ఓట్లు మొత్తం పవన్ - జగన్ చీల్చేసుకుంటే జగన్ కి పెద్ద కష్టం వచ్చినట్టే. పవన్ ని , బాబు ని ఎదిరించి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం కుదిరేపని కాదు అని ఇప్పటికే ఒకసారి నిరూపణ అవ్వడం తో జగన్ రాజకీయ జీవితానికి శుభం కార్డు వెయ్యడం కోసం కూడా పవన్ పావులు కదుపుతున్నాడు అని అంటున్నారు. పవన్ ఎలాగూ ఒంటరిగా పోటీ చేసినా ఎక్కువ స్థానాలకి పోటీ చెయ్యడు అనేది మాత్రం నిజం. ఇలా పోటీ చేసి వైకాపా కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే మాత్రం తానే ప్రతిపక్షం అవుతాడు. ఒకవేళ కొన్ని సీట్ లు జగన్ కి ఎక్కువ వచ్చినా వాటిని చంద్రబాబు సహాయంతో లాగేస్తాడు అనేది తేలికగా చెప్పచ్చు. టిడిపి, పవన్‌ల స్ట్రాటజీ వర్కౌట్ అయి చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం జగన్ రాజకీయ జీవితం క్లోజ్.


మరింత సమాచారం తెలుసుకోండి: