తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. జయ మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని పన్నీర్‌ సెల్వం ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. అంతే కాదు జయ మృతిపై విచారణకు ఆదేశిస్తామని పన్నీర్ ప్రకటించారు. అప్పట్లో జయలలితను కలిసేందుకు తనకు కూడా శశికళ అనుమతివ్వలేదని అంతే కాదు అమ్మకు దగ్గరి బంధువులను, స్నేహితులను ఎవ్వరినీ కూడా ఆమె దగ్గరకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసిందని..అమ్మ దగ్గరకు వెళ్లితే అంటు వ్యాదులు వస్తాయని బెదిరించిందని అన్నారు.  

దాంతో  ఇన్నాళ్లు జయలలిత మరణం వెనుక శశికళ పాత్ర ఉన్నట్లు ప్రజల్లో ఉన్న అనుమానాలు పన్నీర్ వ్యాఖ్యలతో మరింత బలపడ్డాయి. కాగా జయలలిత అపోలో ఆసుప‌త్రిలో 75 రోజులపాటు చికిత్స తీసుకొని ఇటీవ‌లే కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మృతిపై ప‌లువురు అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రపతిని కోరింది అన్నాడీఎంకే  తిరుగుబాటు ఎంపీల బృందం.
Related image
రాష్ట్రపతి భవన్‌ లో మైత్రేయన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసిన ఎంపీల బృందం.. మెమోరాండంను అందజేశారు. జయ మృతిపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. అమ్మ జ్వరంతో మాత్రమే బాధపడ్డారని ఆస్పత్రి వర్గాలు ముందుగా ప్రకటించాయని, చనిపోయిన తర్వాత అనారోగ్య కారణాలు చెప్పడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: