నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైసీపీ అధినేత జగన్‌ హల్‌చల్‌ చేశారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్ వద్ద నుంచి జగన్ లాక్కున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏపీ ప్ర‌భుత్వం ప‌లువురిని కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌పుతోంద‌ని ఆరోపించిన జ‌గ‌న్‌... బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్ వద్ద నుంచి జగన్ లాక్కొని, తిరిగి ఇవ్వ‌లేదు. వైద్యులు బ‌తిమిలాడినా ఆ రిపోర్డును జ‌గ‌న్ ఇవ్వ‌కుండా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



జగన్ వద్ద నుంచి కలెక్టర్ పోస్టుమార్టం రిపోర్టును తిరిగి లాక్కోవడంతో వైసీపీ అధినేతకు అరికాలి మంట నెత్తికెక్కింది. కలెక్టర్‌పై అంతెత్తున లేచారు. చెయ్యి తియ్యి అంటూ మండిపడ్డారు.  క‌లెక్ట‌ర్‌ను సెంట్రల్‌ జైలుకు పంపిస్తానని మండిప‌డ్డారు. పోలీసులు, క‌లెక్ట‌ర్ స‌హా అంద‌రూ అవినీతిప‌రులేన‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 



ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడిన జగన్... ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించడంతో డాక్టర్‌ నుంచి పోస్టుమార్టం రిపోర్టును జగన్‌ లాక్కున్నారు. అక్కడే ఉన్న కలెక్టర్‌ అభ్యంతరం చెప్పడంతో జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: