mulapadu bus accident కోసం చిత్ర ఫలితం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికేమైంది? భవిష్యత్ వద్దా?  రవాణాశాఖ అసలు ఉనికిలో ఉందా? ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి రాష్ట్ర అభివృద్దికి అడ్డువస్తునాడంటూ పదేపదే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి మీటింగులో నొకివక్కాణిస్తూ ఉంటారు. ఇక్కడ ఆసు పత్రి వచ్చి వివరాలు సేకరించే ప్రతిపక్ష నేత పై తెలుగుదేశం కార్యకర్తలు వ్యతిరేఖంగా నినాదాలు చేయటమేమిటి? ముందలి కాళ్ళకు బంధం వేయటమా? అసలు జరిగింది బస్సు ప్రమాదం. 11 మందివరకు ధారుణ మరణాలు సంభవించాయి. 20 మందికి పైగా ప్రమాదంలో బలమైన గాయాలతో సరిగా కోలుకుంటారో లేదో అర్ధంగాని పరిస్థితి.   


mulapadu bus accident కోసం చిత్ర ఫలితం


బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బస్సు యాజమాన్యాల నుంచే నష్ట పరి హారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసు కుంటారని, లేదంటే ఏదో ఒక రోజు అందరి కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు పోకుండా మానవతా దృక్పథం తో ఆలోచించి ప్రభుత్వం, పోలీసులు, మీడియా ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.


అసలు ఆయన ఏవరైనా కావచ్చు ప్రతిపక్ష నేతకావచ్చు, ప్రజల నుండి వారి ప్రతినిధిగా ఆయన ప్రశ్నించ వచ్చు. అలాంట ప్పుడు అక్కడ రాజకీయమేముంది?  ఈ ప్రమాదానికి టిడిపి కార్యకర్తలు కారణమైతే వారేదో గొడవ చేస్తే జిల్లా అధికారులు వెంటనే వారిని అరెష్ట్ చెయ్యాలి.  టిడిపి కార్యకర్తల సొంత సంస్థా  దివాకర్ ట్రావెల్స్?


mulapadu bus accident కోసం చిత్ర ఫలితం


డిజిపి గారికి ప్రమాదం జరిగిన బస్సు యాజమాన్యం ఎవరో తెలియదట? వినేవాళ్ళు వెధవాయిలైతే డిజిపి స్థాయి వ్యక్తులు అలా మాట్లాడతారు.  దివాకర్ ట్రావెల్స్ ఎవరిదో తెలియదా? ట్రాన్స్-పోర్ట్ వ్యవస్థ లేదా? వాళ్ళ నుండి వివరాల సేకరణ చేయలేరా? బహుశ పోలీస్ వ్యవస్థ కింద నుండి పై దాకా లంచాలు తినబట్టే ఇలా డిజిపి మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే కడుపు చించుకుంటే తన వ్యవస్థ కాళ్ళమీదే పడుతుందనే కావచ్చు అంటున్నారు ప్రజలు.


DGP of AP and Dist collector of Krishna కోసం చిత్ర ఫలితం


కాంట్రాక్ట్ కారేజ్ లైసెన్స్ తో ట్రావెల్స్ తమ బస్ లను స్టేజ్ కారేజులుగా నడుపుతున్నారనేది జగమెరిగిన సత్యం.  దివాకర్ ట్రావెల్స్ కూడా ఆ తానులోని ముక్కే. వీళ్ళు ఒక లైసెన్స్ పై నాలుగు బస్ లను నడుపు తూనే ఉన్నారు. దీనికి రవాణాశాఖ, పోలీస్ వ్యవస్థ, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర అధికారుల కక్కుర్తే కారణమని ప్రజలకు బాగా తెలుసు.   


చనిపోయిన వారి ప్రాణాలు తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలు మనోధైర్యంగా ఉండేందుకు అండగా నిలవాలన్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని, ఇలాంటి యాజ మాన్యాలకు మద్దతు ఇవ్వకూడదని చెప్పారు ప్రతిపక్షనేత. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు  వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.


Dist collector of Krishna with jagan mohan reddy కోసం చిత్ర ఫలితం


ఈ ప్రమాదంలో మొత్తం డ్రైవర్ తో సహా 11 మంది మరణించగా 20 మందికి పైగా బలమైన గాయాలతో తికిబయటపడ్డా వారికి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడవచ్చు.  మృతదేహాలను నందిగామ ఆస్పత్రికి తరలించగా ఘటన వివరాలు తెలుసుకొని బాధితులను పరామర్శించి అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌ ఆస్పత్రి వద్దకు వెళ్లగా,  ఆ విషయం తెలిసి అక్కడ టీడీపీ కార్యకర్తలు హైడ్రామాకు తెరతీశారు.

 

ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి రెచ్చగొట్టే తీరుగా వ్యవహిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృత దేహాలకు సరిగా పోస్టుమార్టం నిర్వహించ కుండానే ఆస్పత్రి నుంచి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులే స్వయంగా ఈ చర్యలకు పాల్పడటం విస్మయానికి గురిచేసింది.


mulapadu bus accident కోసం చిత్ర ఫలితం

ఈ సమయం లో కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాజకీయాల సమయం కాదని, చనిపోయినవారిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోకి వెళ్లారు. కలెక్టర్‌ అహ్మద్‌బాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రత, అందులోని లోపాలు, ప్రభుత్వం అనుసరించిన తీరు, నష్టపరిహారం తదితర అంశాలపై నిప్పులు చెరిగారు. ఆయన ఏమన్నారంటే.


‘బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్న బీమాకింద ఆంధ్రప్రదేశ్‌ వారికైతే రూ.3 లక్షలు, తెలంగాణ ఇతర ప్రాంతాలవారికైతే రూ.2లక్షలు నష్టపరిహారం ఇస్తా మంటున్నారు. ఈ నిర్ణయాన్ని అస్సలు అంగీక రించేది లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన డ్రైవర్‌కు చెందిన యాజమాన్యం నుంచి కనీసం రూ.20 లక్షలు నష్ట పరిహారం బాధితుల కుటుంబాలకు ఇప్పించాలి. అలా చేయకుంటే బస్సు యాజమాన్యాలు మారవు. ఇప్పుడు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఏదో ఒక రోజు మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మన భార్యలు కూడా ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


chandrababu about bus accident today కోసం చిత్ర ఫలితం


మానవతా హృదయంతో ఆలోచించండి, పెద్ద మనసులతో ఆలోచించండి. తప్పు చేసినవారిని ప్రశ్నించండి. ప్రతి పోలీసు సోదరుడు, ప్రతి  విలేకరి,  ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మానవత్వంతో ఆలోచించాలి. మరోపక్క, చనిపోయిన బస్సు డ్రైవర్‌కు పోస్టుమార్టం చేయకపోయినా చేశామంటున్నారు. డ్రైవర్‌ తాగి బస్ నడిపాడా లేదా?  అని ప్రశ్నిస్తే పోస్టు మార్టం చేయలేదని డాక్టర్లు చెబుతున్నారు. అంటే డ్రైవర్‌కు పోస్టు మార్టం కూడా చేయకుండానే మృతదేహాన్ని ప్యాక్‌ చేశారు. రెండో డ్రైవర్‌ ఏమయ్యాడని అడిగితే వచ్చి వెళ్లాడని చెబుతున్నారు. రెండో డ్రైవర్‌ వెళ్లిపోయాడా..? వెళ్లగొట్టారా? అతడి దగ్గర లైసెన్స్‌ ఉందా లేదా? ఒక వేళ లైసెన్స్‌ ఉంటే, తాగి ఉండకుంటే అతడిని ఇక్కడే ఉంచేవారు.


కానీ పంపించారంటే అతడు ఈ రెండింట్లో ఏదో ఒక లోపం కలిగి ఉండి ఉండొచ్చు. ఇదంతా ఆలోచిస్తుంటే ప్రభుత్వం పెద్ద కుట్రనే చేస్తోందనిపిస్తోంది. ఇప్పుడున్న రెండో డ్రైవర్‌ను పంపించేసి కొత్త డ్రైవర్‌ను తీసు కొచ్చి ఇతడే నడిపాడని చెబుతారు. ఒక పద్థతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని రక్షిస్తారు. ఏడాదికిందట కేశి నేని, అంతకు ముందు ఒకసారి  ఇప్పుడు దివాకర్‌ ట్రావెల్స్‌‌. ఈ రెండింటి  యాజమాన్యాలు టీడీపీ ఎంపీలవి.


అందుకే చంద్రబాబు దగ్గరుండి మద్దతిస్తున్నారు. అందుకే వారికి రూల్స్‌ ఉండవు. ఒక పర్మిట్‌తో ఒకే చోట రెండు మూడు బస్సులు, రెండు మూడు రూటుల్లో తిప్పుతారు. స్టేజ్‌ క్యారియర్‌కు పర్మిషన్‌ లేకున్నా ఆపేసి ప్యాసింజర్లను ఎక్కించుకుంటారు. వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే టిడిపి లి దాని నాయకత్వానికి అంతిమ గడియలు దాపు రించినట్లే అంటున్నారు. ఇప్పటికే 'ఓటుకు నోటు కేసు' లో  విచారణపై స్టే తెచ్చుకున్న తీరును ప్రజలెవరూ హర్షించట్లేదు. ఇంకా ఎన్నో నేరాల చిట్టా ముఖ్య మంత్రి కుంది. ఇంత జరిగినా ఇప్పటికి టిడిపి ఎంపి ఐన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని ప్రభుత్వం వెనకేసుకొస్తే రానున్న కాలములో ఆ పార్టీకి సహకరించే నాయకులకు కార్యకర్తలకు ఆంధ్రా జనం సమాధానం ధారుణంగా ఉంటుంది. జిల్లా కలక్టర్ బాబు తీరూ అనుమానాస్పదమే.    


diwakar travels bus accident hd images కోసం చిత్ర ఫలితం


“లైసెన్స్‌ పట్టించుకోరు. ఈ బస్సు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో దెబ్బతిన్న బస్సును చూస్తే తెలుస్తోంది. అంతపెద్ద రోడ్డుపై ఎదురుగా వాహనం వచ్చే అవకాశం లేదు  ప్రమాద సమయంలో బస్సు 150 కిలో మీటర్ల వేగంలో ఉండి కల్వర్టు కోడను ఢీకొట్టి 150 అడుగులు దూరం గాల్లో ప్రయాణించి కల్వర్టు అవతలి గోడను ఢీకొట్టింది. కచ్చితంగా డ్రైవర్‌ తాగి ఉండి ఉంటాడు. అందుకే చనిపోయిన డ్రైవర్‌కు పోస్టు మార్టం నిర్వహించలేదు. రెండో డ్రైవర్‌ను అరెస్టు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి ఘటనకు కారణమైన వారిని ప్రొటెక్ట్‌ చేయడం సరికాదు. పోలీసులు ఈ విషయంలో ఆలోచించాలి. లేదంటే ఇలాంటి ఘటన లకు ఎవ్వరం కూడా మినహాయింపు కాకుండా పోము” అని వైఎస్‌ జగన్‌ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 100% యదార్ధం. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. న్యాయం చేయకపోతే ప్రజలు క్షమించరు. 


chandrababu about bus accident today కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: