రాజకీయ పార్టీల బహిరంగ సభల్లో నాయకులు ఫోజుల కోసం నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు. తమ నాయకుడితో ఒక్క ఫోటో దిగితే చాలు.. అని తెగ తాపత్రయపడుతుంటారు. ఒక్క సెకను పాటు తమ నాయకుడితో పాటు ఉన్నా.. ఆ ఫోటోను పెద్దగా తీయించుకుని ఇంటి డ్రాయింగ్ రూంలో పెట్టుకుని పొంగిపోతారు. 

Image result for pawan kalyan sword

మరి నాయకుడి కంట్లో పడాలంటే ఎలా.. ఓ గజమాల కొనుక్కొచ్చి వేయాలి.. లేకపోతే ఓ శాలువా కప్పాలి. అదీ కాకపోతే.. ఓ నాగలో, గొడ్డలో, కత్తో బహుమతిగా అందించాలి. ఇవేవీ కాకపోతే.. గొర్రెపిల్లనో, మేకపిల్లనో బహుమతిగా అందించాలి. ఇలా నాయకులకు వచ్చే బహుమతులు చాలానే ఉంటాయి. కానీ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ అరుదైన కానుక వచ్చింది. 

Image result for pawan kalyan sword

ఆ కానుక ఇచ్చింది ఎవరో కాదు.. తోటినటుడు శివ బాలాజీ. ఇంతకీ శివబాలాజీ బహుమతిగా ఇచ్చిందేంటో తెలుసా.. ఓ ఖడ్గం. అవును.. పవన్ కల్యాణ్.. కాటమరాయుడు సినిమా షూటింగ్ లో శివబాలాజీ ఈ గిఫ్ట్ ఇచ్చాడట. ఎందుకంటే శివ బాలాజీ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. ఖడ్గం అంటే ఏదో మార్కెట్లో దొరికే తళుకు బెళుకు ఖడ్గం అని సింపుల్ గా కొట్టిపారేయకండి. 

Image result for siva balaji presents word to pawan kalyan

ఆ ఖడ్గాన్ని శివబాలాజీ ప్రత్యేకంగా డెహ్రూడన్ నుంచి తెప్పించారట. అక్కడ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారట. పవన్ కల్యాణ్ ప్రజల కోసం పోరాడుతున్న వీరుడు కాబట్టి ఆయనకు ఖడ్గం బహుకరించాలనుకున్నాడట. అందుకే ప్రత్యేకంగా ఉండాలని దీన్ని డెహ్రాడూన్ లో డిజైన్ చేయించి, తయారు చేయించాడట. అంతే కాదు.. ఆ ఖడ్గంపై జనసేన అని కూడా రాయించాడట. బావుంది కదూ శివబాలాజీ ప్రత్యేక కానుక.



మరింత సమాచారం తెలుసుకోండి: