ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి రాకు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా తిరుమల ను సందర్శించడానికి విదేశాల నుండి మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అయితే తిరుమల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుందనేది అందరికీ విదితమే. అయితే తిరుపతి లో చోటుచేసుకొనే ఏ చిన్న తప్పైనా దాన్ని పెద్దదిగా పరిగనిస్తారు.


నకిలీ నోట్లున్నాయని..

అందులోనే భాగంగా  తిరుమల పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఢిల్లీకి చెందిన వృద్ధ దంపతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తీర్థయాత్రల్లో భాగంగా శ్రీవారి దర్శనం కోసం ఢిల్లీకి చెందిన ప్రదీప్‌(65), ఆయన భార్య మంగళవారం తిరుమలకు వచ్చారు. లేపాక్షి నుంచి తాము బస చేసిన ఎంబీసీ - 14కు జీపులో వెళ్లి, దాని డ్రైవర్ కు రూ. 100 ఇచ్చారు. అక్కడే గొడవ మొదలైంది. తన కిచ్చిన నోటు నకిలీదంటూ ఆ డ్రైవర్ గొడవ ప్రారంభించాడు.


Image result for ttd

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదీప్, ఆయన భార్యలను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న రూ. 12 వేలను స్వాధీనం చేసుకున్నారు. తీరా ఆ నోట్లను తిరుమలలోని ఓ బ్యాంకుకు పంపగా అవి ఒరిజినల్‌ నోట్లే అని తేలింది. దీంతో వారికి నగదు అప్పగించి పంపించేశారు. కాగా, ప్రదీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాము మధుమేహ వ్యాధిగ్రస్తులమని, ఎక్కవ సమయం వేచి ఉండలేమని చెప్పినా పోలీసులు కనికరించలేదని వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: