ఎన్నుకోక ఎన్నుకోక ట్రంప్ లాంటి డిఫరెంట్ పర్సన్ ని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అమెరికన్ లు. తీరా ఎన్నుకున్న తరవాత అయ్యో తూచ్ ఇతను కాదు మాకు కావాల్సింది అంటూ ప్లేటు ఫిరాయించారు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన రోజు నుంచీ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల పట్ల ఇప్పుడు వివిధ రకాలుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తీరు పట్ల నిరసన తెలియజేస్తున్న కొందరు అమెరికన్ లు తన పన్ను చెల్లింపులు సైతం ఆపేస్తున్నారు. అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకించటానికి వారు చెబుతున్న కారణాలలో ప్రతిపాదిత మెక్సికన్ సరిహద్దు గోడ నిర్మాణంతో పాటు తాము చెల్లిస్తున్న పన్నుల సొమ్మును పర్యావరణ విధ్వంసానికి దేశ అణ్వస్త్ర పాటవ విస్తరణకు వినియోగిస్తారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.


అమెరికన్ ప్రముఖులు కూడా ఈ పన్నుల చెల్లింపు నిరాకరణ కి తమ మద్దతు ప్రకటించడం పెద్ద చర్చగా మారింది. 1968 లో వియత్నాం యుద్ధం జరగకూడదు అంటూ అప్పట్లో జనాలు పన్నులు కట్టడం మానేశారు.


మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత ఆ పరిస్థితి పునరావృతం అవ్వడం విశేషం.ట్రంప్ తమ పన్ను వివరాలు బయట పెట్టి వాటిని సరైన మార్గం లో ఖర్చు పెడతాం అని మాట ఇచ్చేదాకా తమ వ్యవహార శైలి మార్చుకోము అని తెగించి చెబుతున్నారు అమెరికన్ లు. అమెరికాలో జాతీయ పన్నుల దినోత్సవంగా నిర్వహించే ఏప్రిల్ 15న ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: