అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి ప్ర‌సంగం చేసిన విష‌యం తెలిసిందే. దీనికి ముందు ఆయ‌న త‌న లిమోజ‌ర్‌లో కూర్చొని ఆ ప్ర‌సంగ పాఠాన్ని బట్టీ కొడుతున్న స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయింది. చిన్న పిల్లాడి కంటే అన్యాయంగా హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తూ ట్రంప్ ఆ ప్ర‌సంగ పాఠాన్ని బ‌ట్టీ పట్టిన‌ట్లు ఆ వీడియోలో క‌న‌బడుతోంది. త‌న లిమోజ‌ర్‌ కారులో కూర్చొని ఆ ప్ర‌సంగ పాఠాన్ని ఆయ‌న చ‌దువుకున్నారు.



ఈ వీడియో చూసి నెటిజ‌న్లు తెగ న‌వ్వుకుంటున్నారు. చుట్టూ ఉన్న టీవీ కెమెరాలు త‌న‌ను చూస్తున్నాయ‌ని విష‌యాన్ని కూడా మ‌రచిపోయి ట్రంప్‌.. ప‌రీక్ష‌లు ప్రిపేర్ అవుతున్న చిన్న పిల్లాడిలో ఆ ప్ర‌సంగాన్ని బ‌ట్టీ కొడుతున్న తీరు న‌వ్వు తెప్పించింది. ఓ యూజ‌ర్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. ట్రంప్ త‌న ప్ర‌సంగాన్ని ఎలా బ‌ట్టీ కొడుతున్నారో అంటూ ట్వీట్ చేశారు.


Image result for trump

దీనికి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. గంట‌ల్లోనే వేల కొద్దీ లైక్స్‌, రీట్వీట్స్ వ‌చ్చాయి. కొంద‌రు ట్రంప్ ప్ర‌సంగాన్ని బ‌ట్టీ కొట్ట‌డాన్ని స్వాగ‌తించ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం హేళ‌న చేశారు. ట్రంప్ ఏం చ‌దువుతున్నారో ఊహిస్తూ ఓ యూట్యూబ్ చానెల్ లిప్ రీడింగ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. ట్విట్ట‌ర్‌లో ట్రంప్ బ‌ట్టీ వీడియోపై ఎవ‌రేమ‌న్నారో మీరే చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: