జగన్ ఇటీవల అధికారులపై చిర్రుబుర్రులు ఎక్కువ చేశారు.. మొన్న పోలీసులు అధికారులు.. నిన్న ఐఏఎస్ అధికారులు.. పాపం జగన్ ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులంటే పాపం కాస్త రఫ్ గానే ఉంటారు. అలాంటి ట్రీట్ మెంట్ వారికి విధి నిర్వహణలో కొత్తేమీ కాదు.. ధర్నాలు, రాస్తారోకోల సమయంలో వారు అంతకంటే ఎక్కువ సీన్లే చూస్తారు.. 


కానీ నందిగామలో మాత్రం జగన్ చేతిలో చీవాట్లు తిన్నది మాత్రం ఏ సాధారణ అధికారో కాదు.. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్. గుర్తు పెట్టుకో.. నిన్ను కూడా సెంట్రల్ జైలుకు పంపిస్తా అంటూ జగన్ ఆయనకు వార్నింగ్ ఇచ్చేశారు. పాపం జగన్ ఆగ్రహం చూసి ఆయన కూడా సైలెంటైపోయారు. జగన్ కాక మీద ఉన్నప్పుడు కాస్త కూల్ గా ఉంటేనే బెటర్ అనుకున్నట్టున్నారు. 

Image result for collector babu.a
ఇంతకీ ఈ కలెక్టర్ ఎవరు.. ఆయన నేపథ్యం ఏంటి.. ఓసారి తెలుసుకుంటే షాక్ కాక తప్పదు. ఆయనపేరు బాబు. ఎ. పేరు చూసి బాబు అంటే ఏ బాబో అనుకుంటారు చాలా మంది కానీ ఆయన పూర్తి పేరు అహ్మద్ బాబు. షార్ట్ కట్ లో బాబు.ఎ. అని రాసుకుంటారు. ఆయన రాసుకోవడమే కాదు.. అలానే రాయాలని పత్రికల వారిని కోరతారు. అలా రాయకపోతే గుర్తు చేసి మరీ రాయించుకుంటారు. 

Related image
ఇక ఈ కలెక్టర్ చరిత్ర చూస్తే.. నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. పేరులో బాబు చూసి ఈయన మన తెలుగు వాడే అనుకుంటారు చాలా మంది కానీ.. ఈయన స్వస్థలం కేరళ. ఈయన 2003 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. టెక్నాలజీపరంగా ఆయన చాలా అడ్వాన్సుడ్ అన్నమాట. అందుకే కృష్ణా కలెక్టర్ గా ఉన్న ఈయన ఈ పోస్ ద్వారా రేషన్ దుకాణాల్లో అవినీతిని టెక్నాలజీ ద్వారా అడ్డుకట్ట వేశారు. చిరుద్యోగులకు కూడా ట్యాబుల వినియోగం అలవాటు చేసి అవినీతికి అడ్డుకట్ట వేశారు. 

Image result for collector babu.a

మొన్నటికి మొన్న డీమానిటైజేషన్ సమయంలో ఈ పోస్ కు ఆధార్ ను లింక్ చేస్తే ఫలితాలు అద్బుతంగా ఉంటాయని చెప్పడమే కాకుండా చేసి చూపించారు. బాబు టాలెంట్ చూసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారు. ఎంతగా అంటే.. కలెక్టర్ల సదస్సులో అందరిముందూ ఆయన్ను ప్రత్యేకంగా పిలిచి శాలువాతో సన్మానం చేశారు. కృష్ణా జిల్లాను తొలి డిజిటల్ లావాదేవీల జిల్లాగా రూపొందించారు బాబు.ఎ. 

Related image
అంతే కాదు.. ఆయన్ను గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు లాంటి వారు కూడా మెచ్చుకున్నారు. టెక్నికల్ పరంగానే కాదు.. పనిలోనూ బాబు కలెక్టర్ చాలా ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ను కృష్ణా జిల్లా నుంచి పంపించాలని చాలామంది నాయకులు చాలా రకాలుగా చంద్రబాబుకు కంప్లయింట్ చేశారు..కానీ సీఎం ప్రత్యేక శ్రద్ధతో ఆయన్నే కొనసాగిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: