కూచిభొట్లది జాత్యహంకార హత్యే: డోనాల్డ్ ట్రంప్


కూచిభొట్ల శ్రీనివాస్‌ది జాత్యహంకార హత్యేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్ తొలిసారి మాట్లాడారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ కేన్సస్ కాల్పుల ఘటన బాధితులకు నేడు సంతాపం తెలిపి రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. జాతి వివక్షతో కూడిన దాడులకు అమెరికాలో చోటు లేదన్నారు. అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 


నోట్ల ర‌ద్దుపై అమెరికా ఫైనాన్స్ సంస్థ కామెంట్స్..
Image result for moody's investors

పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల భార‌త్‌కే మేలు జ‌రుగుతుంద‌ని అమెరికాకు చెందిన మూడీస్ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీస్ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప‌న్ను ఎగ‌వేత‌, అవినీతి తగ్గుతుంద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే ఆర్థిక ఒడిదుడుకుల‌ను భార‌త్ స‌మ‌ర్థంగా ఎదుర్కుంటుంద‌ని ఆ సంస్థ పేర్కొన్న‌ది. అయితే నోట్ల ర‌ద్దు వ‌ల్ల జ‌వ‌న‌రి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక‌వృద్ధి ఏడు నుంచి 6.4 శాతానికి ప‌డిపోతుంద‌ని ఆ సంస్థ తెలిపింది. 


శ‌శిక‌ళ సెల్‌లో ఏసీ లేదు.. టీవీ ఒక్క‌టే..


అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వీకే శ‌శిక‌ళ‌కు జైలులో ఎటువంటి రాచ‌మ‌ర్యాద‌లు లేవ‌ని ప్రిజ‌న్స్ డీఐజీ తెలిపారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద దాఖ‌లైన ఫిర్యాదుకు స‌మాధానంగా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. శ‌శిక‌ళ గ‌దిలో కేవ‌లం టీవీ ఏర్పాటు చేసిన‌ట్లు డీఐజీ తెలిపారు. బెంగుళూరులోని పరప్పన్ అగ్రహార జైలులో ప్రస్తుతం శశికళ జైలు జీవితం గడుపుతున్నారు. ప్రత్యేక బాత్‌రూమ్, వాట‌ర్ హీట‌ర్‌, ఏసీ, ప‌రుపు మంచం లాంటివి ఏవీ ఆమె సెల్‌లో ఏర్పాటు చేయ‌లేద‌ని డీఐజీ చెప్పారు. 


ఎస్టీ కమిషన్ చైర్మన్ నంద్‌కుమార్ బాధ్యతలు.. 

Image result for Chairman of National Commission for Scheduled Tribes
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎస్టీ) చైర్మన్‌గా నంద్‌కుమార్ రాయ్ (71) బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి పదవి ర్యాంకు స్థా యి హోదాతో ఈ పదవిలో మూడేండ్లు కొనసాగుతా రు. మారుమూల ప్రాంతా ల్లోని ఎస్టీల హక్కులను కాపాడేందుకు కృషిచేస్తానని ఆయన అన్నారు. షెడ్యూల తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధిలో తమ కమిషన్ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. 1977, 1985, 1998 మధ్యప్రదేశ్ శాసనసభకు, 2000లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఎన్నికై మొదటి ప్రతిపక్ష నేతగా కొనసాగారు.


చైనాలో 5 లక్షల ఉద్యోగాలు ఔట్.. 

Image result for china govt
చైనా ప్రభుత్వం భారీ పరిశ్రమల రంగంలో  మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను  తొలగించేందుకు నిర్ణయింది.  ముఖ్యంగా స్టీల్‌ మరియు ఉక్కు సహా ఇతర భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 5 లక్షలమంది ఉద్యోగులను  తొలగించనుంది. ఈ మేరకు  చైనా కార్మికశాఖ మంత్రి యిన్‌  వీమెన్‌  బుధవారం జారీ చేసిన  ప్రకటన జారీ చేశారు. అదనపు  మిగులు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: