జగన్ కు సెంట్రల్ జైల్ ఊతపదమైందన్న సీఎం.. 


దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం సందర్భంగా ఏర్పడిన వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అధికారులు ఏం చేస్తారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు సమర్థవంతమైన అధికారి అని చంద్రబాబు ప్రశంసించారు. అలాంటి కలెక్టర్‌ను జైలుకు పంపుతామని జగన్‌ బెదిరిస్తున్నారని, జగన్ కు సెంట్రల్ జైలు ఉతపదమైందని ముఖ్యమంత్రి అన్నారు. 


జగన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరిందన్న దేవినేని


జగన్‌కు ముఖ్యమంత్రి పిచ్చి పరాకాష్టకు చేరిందని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. జగన్‌ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని, జగన్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. జగన్ మానసిక స్థితి బాగోలేదన్నారు. జగన్‌ అధికారులపై దౌర్జన్యం చేయడం మానుకోవాలన్నారు. నూతన అసెంబ్లీ భవన ప్రారంభానికి జగన్‌ను ఆహ్వానించామని మంత్రి దేవినేని అన్నారు.


జ‌గ‌న్‌ పై ఐఏఎస్ లు గరం.. గరం.. 


కలెక్టర్‌ను జైలుకు పంపుతామని జగన్ ఎలా అంటారు? అని ఐఏఎస్‌ అధికారి ఏకే ఫరీదా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం గౌరవించుకోవాలని ఏకే ఫరీదా అన్నారు. వ్యవస్థలో అధికారులు కీలకభాగమని ఐఏఎస్‌ అధికారి ఏకే ఫరీదా తెలిపారు. అధికారులను కించపరిచినవారిని ప్రజలు గౌరవించరని ఐఏఎస్‌ అధికారి ఏకే ఫరీదా గుర్తు చేశారు. 


కందుల కొనుగోళ్లపై హరీశ్ రావు సమీక్ష...


కందుల కొనుగోళ్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12.64లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో హరీశ్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. కందుల కొనుగోళ్లపై నాఫెడ్ ఎండీతోనూ హరీశ్‌రావు మాట్లాడారు. నాఫెడ్ ద్వారా మరో 5లక్షల క్వింటాళ్ల కందులు, ఎఫ్‌సీఐ ద్వారా మరో 2.5లక్షల కందులు కొనాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


కేసీఆర్‌ది దొంగ దీక్ష కాదని నిరూపిస్తారా?..
Image result for mallu ravi
‘కేసీఆర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాలేదు. ఆయన ఎలా  దీక్ష చేశారో .. ఎలా విరమించారో .. ఉస్మానియా విద్యార్థుల నుంచి ఎలా నిరసన ఎదుర్కొన్నారో జనానికి తెలుసని’  టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష కాదని తెరాస నేతలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేదని తెరాస నేతలు మాట్లాడటం, ఆయన పై విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానమేనన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: