తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌లు, ప‌దువులు ఇచ్చే క్ర‌మం గ‌మ‌నిస్తే సంద‌ర్బోచితంగానే ఉంద‌నే చెప్పాలి. గ‌తంలో టీడీపీ ఆధినేత నంద‌మూరి తార‌క రామారావు, ఆనంత‌రం కాంగ్రెస్ గాడీలోని తెచ్చిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌ను దాదాపుగా ఫాలో అవుతున్నారు గులాబీ ద‌ళ‌ప‌ది కేసీఆర్.  ప్ర‌తిప‌క్షాలు చేసే డిమాండ్ ల‌ను గ‌మ‌నించిన ఆయ‌న వెంట‌నే దాని పై స్పందించి డిమాండ్ల‌ను అమ‌లు చేసి క్రెడిట్ త‌న ఖాతాలో వేసుకుంటు న్నారు. 


ముస్లీం, ఎస్సీ,ఎస్టీ బీసీ, మెనార్టీల‌కు వ‌రాలు కురిపించ‌డ‌మే కాకుండా కుల వృత్తులపై ఆధార‌ప‌డే వారికి ప్ర‌త్యే క యూనిట్‌ల‌ను ఏర్పాటు చేసి క్రెడిట్ అంతా  తన ఖాతాలో వేసుకుంటున్నారు. అవ‌స‌రానికి ఎలా  స్పందించి స‌మస్యను ఏలా అధిగ‌మించాలో తెలిసిన వ్య‌క్తి కేసీఆర్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ముస్లీం ల‌కు రంజాన్ పండుగ నాడు కుటుంబానికి స‌రిప‌డే దుస్తులు పంపిణి, క్రీస్మ‌స్ నాడు క్రిస్టియ‌న్‌ల‌కు చీరలు, ప్యాంట్‌, ష‌ర్ట్ బ‌ట్ట‌లు ఇస్తున్నారు కేసీఆర్. తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో ముస్లీంల‌కు పెద్ద పీట వేసింది చూశాం. 

ఇలా ఆయ‌న చేసిన ప్ర‌తి ప‌థ‌కం ఒక సంద‌ర్భంగా మిగిలిపోతున్నాయి. ఇలా 2019 ఎన్నిక‌ల టార్గెట్‌ను ఎంచుకుని ప‌థ‌కాల వ్య‌వ‌హారంలో ముందుకు పోతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మొదటి క్యాబినేట్ లో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త లేద‌న్న ఆరోప‌న‌లు ఉన్నాయి. అంతేందుకు ఇదే విష‌యాన్ని స్వ‌యానా త‌న కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి పుల్ స్టాప్ పెట్టాల‌ని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

తాజాగా అంతర్జాతీ య మహిళాది నోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. పరి పాలనలో మహిళ లకు భాగస్వామ్యం కల్పిం చేందుకుగాను తెలంగాణ ఉద్యమంలో కీలకం గా పనిచేసిన వారికి, మహిళాభ్యుదయా నికి కృషిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.  వివిధ కార్పొ రేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో వీరికి అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

అర్హు లైన మహిళలను గుర్తించి ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అర్హులైన మహిళలను ఎంపికచేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆ కమిటీకి సూచించారు. కమిటీ నుంచి వచ్చే సూచనల మేరకు కొద్దిరోజుల్లోనే మహిళలకు పదవులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటిం చారు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని సీఎం చెప్పారు. మహిళల కోసం ఈ ఏడాది మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకొని మహిళలు అన్నిరంగాల్లో ముందంజ వేయాలని సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: