ఎప్పుడేప్పుడాని ఎదురు చూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది. పార్టీలో చేరిన నాయ‌కుల‌కు మంచి రోజులు రాను న్నాయి. జీవితంలో ఒక్క‌సారైన ఎమ్మెల్యే కావాల‌నుకునే ఆశావాహుల క‌ల నెర‌వేర‌నుంది. పార్టీలు మారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఎదురు చూస్తున్న వారికి, వలసల నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి అవ కాశం కల్పించాలనుకుంటున్న ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది  ఒక  ఒక శుభవార్తేన‌ని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు... ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు ప్రతిపాదనల్లో కదలిక వచ్చింది. 


ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకునేందుకు విభజన చట్టం లో అవకాశం కల్పించారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ అవ సరాల రీత్యా ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నేతలను చేర్చుకున్నాయి. అంతేకాకుండా, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజక వర్గాలు పెరుగుతాయని, అందరికీ ‘న్యా యం’ జరుగుతుందని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. విభజన చట్టం మేరకు నియోజకవర్గాల సంఖ్య పెంచాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. 

అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అధికార ప్రక్రియకు శ్రీకారం చు ట్టింది. నియోజకవర్గాల పెంపుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా... భౌగోళిక, ఇతర సంబం ధిత గణాంకాలు, పాలనా యూనిట్లలో మార్పులు, చేర్పులతో కూడిన ‘అడ్మినిస్ట్రేటివ్‌ రిపోర్ట్‌’ పంపించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉభయ రాష్ట్రాల‌కు వర్తమానం అందింది. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెం బ్లీ, 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండేవి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలు వెళ్లాయి. 

తెలంగాణకు 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు సాధ్యంకానం దున, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం... తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ సంఖ్యను తొమ్మిదికి పెంచబోతున్నారు. అంటే...ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు అవుతాయి.
 
కేంద్ర న్యాయశాఖ నుంచి వచ్చిన వర్తమానం ప్రకారం... ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను పునర్విభజించి కొత్త సంఖ్య మేరకు సరికొత్త ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వాలు పంపాల్సి ఉంటుంది. తెలంగాణకు సంబం ధించి కొత్త జిల్లాల ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముసాయిదాను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఇతర జిల్లాల్లో పెద్దగా మార్పులకు అవకాశం లేకపోయినప్పటికీ, హైదరాబాద్‌ నియోజ కవర్గాల విషయంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఈ సమ స్యేదీ లేదు.
 
నియోజకవర్గాల పునర్విభజన కోసం అధికారుల స్థాయి కమిటీని నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో ఆయా రాష్ట్రాల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) సభ్యుడిగా ఉండాలి. అయితే, రాష్ట్ర పునర్విభజ న చట్టంలో సూచించిన కమిటీలో ఎస్‌ఈసీ ప్రస్తావన లేదు. తమ రాష్ట్ర ప్రతినిధి లేకుండా ఎవరితోనే కమిటీ వేస్తే సమస్యలు తలెత్తుతాయని, దాన్ని తాము అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వారాంతంలోనే అధికారిక ప్రతిపాదనలను పంపిస్తామని, వచ్చే పార్లమెంట్‌లోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
 
అయితే, వచ్చే ఎన్నికల నాటికి (2019) కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయా? అనే ప్రశ్నపై చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచుకోవాలంటే రాజ్యాంగాన్ని సవరించాలా అనే ప్రశ్న కూడా ఉత్పన్న మవుతోంది. అయితే... ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని రెండు రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు చెబుతు న్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం విభజన జరిగింది. అందువల్ల, ఈ చట్టంలో పేర్కొన్న అంశాలకు... సంబంధించిన అధికరణలన్నీ వర్తిస్తాయని పేర్కొంటున్నారు. 

అయితే, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల మార్పు,సంఖ్య పెంపు అంత ఆషామాషీగా జరిగేది కాదు! అయి తే... నియోజకవర్గాల పెంపునకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశాయని, కేంద్రం రాజకీయంగా సహకరిస్తే 2019 నాటికే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: