పేద ప్ర‌జ‌ల యువ‌తుల పెళ్లి అవ‌స‌రాల‌కు తీర్చ‌డానికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ళ్యాణల‌క్ష్మి ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2014 అక్టోబర్‌ 2న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం 51000 రూపాయలను ప్రభుత్వం నేరుగా దళిత యువతుల కుటుంబానికి అందిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయల మూలధనాన్ని వెచ్చించింది. 


ఇందులో 10 కోట్ల రూపాయలను గిరిజన శాఖ నుం చి, మరో 10 కోట్లను షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలెప్‌మెంట్‌ డిపార్ట్ మెంట్‌ నుంచి విడుదల చేశారు. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న దళిత కుటుంబాలకు చెందినవారు ఈ పథ కానికి అర్హులు. తెలంగాణ స్థాని కత ఉన్న వారు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు కచ్చితం గా 18 సంవత్సరాలు దాటిన వారై ఉండాలి. 

కుల, జనన, ఆదాయ దృవీకరణ పత్రాలతోపాటు, ఆధార్‌ కార్డును స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌ దరఖాస్తు ను పూర్తి చేయాలి. వీటితో పాటు పెళ్లికి సంబందించిన ఆధారాలను కూడా దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. అయితే 2017-18 ఏడాది బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్  వరాల జ‌ల్లులు ప్రకటించారు. కళ్యాణలక్ష్మి లబ్ధి దారు లకు ఇప్పటి వర కు ఇస్తున్న రూ.51 వేలను రూ.75,116కు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

పేదింటి ఆడపడుచుల పెళ్లికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేళ పెట్టినా మొదట్లో కేవలం ఎస్సీ, ఎస్టీవారికే ఈ పథకాన్ని అమలు చేసినా.. తర్వాత బీసీలను కూడా ఇందులో చేర్చారు. ఇక ముస్లిం యువ తుల కోసం షాదీ ముబారక్ పేరుతో ఇంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కళ్యాణ లక్ష్మీ పథకం.. ముస్లీంలకు షాదీముబారక్ పథకం వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: