తెలంగాణ బ‌డ్జెట్ ను గ‌మ‌నిస్తే గ‌తంలో ఏ ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ పెట్ట‌లేన‌ట్ట‌గా ఓ కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. ఈ సారి బడ్జెట్ పూర్తిగా ప‌ల్లె బాట ప‌ట్టింది. సాగునీటికి నిధుల వరద పారిస్తూనే... చితికిన కుల వృత్తులు, కూలి న జీవితాలను నిలబెట్టేందుకు కొత్త నినాదం ఎంచుకున్నారు గులాబీ నేత‌. సీఎం కేసీఆర్‌. అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీసీలకు భరోసా కల్పించారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు తొలిసారి బడ్జెట్‌లో చోటు కల్పించారు. గ్రామీణ ఆర్థిక ప్రగతిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,49,646 కోట్ల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 


రెండేళ్ల ముందే ఎన్నికల బడ్జెట్‌ను ఆవిష్కరించి నట్లుగా భారీగా వరాల జల్లు కురిపించింది. వలస బాట పట్టిన తెలంగాణ బిడ్డలు తిరిగి పల్లెకు పయనం కావాలన్నదే మా ఆకాంక్ష...’ అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ఏ దిశగా పయనించిందో చెప్పారు. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన సాగునీటికి వరుసగా రెండోసారి బడ్జెట్‌లో ప్రభుత్వం సింహభాగం నిధులు కేటాయించింది. కోటి ఎకరాల తెలంగాణ మాగా ణాన్ని ఆవిష్కరించే సంకల్పానికి మరోసారి ప్రాధాన్యమిస్తూ.. సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు ప్రతిపాదించింది.

బడ్జెట్‌లో తొలిసారిగా సామాజిక వర్గాల వారీగా నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్య మిచ్చింది. బీసీ లకు గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు కేటాయించింది. కుల వృత్తుల ఆధారంగా కొత్త కార్యక్రమాలకు రూపక ల్పన చేసింది. యాదవ, ముదిరాజ్‌లకు భారీ స్థాయిలో గొర్రెలు, చేపల పెంపకం కార్యక్రమాలను ప్రకటించింది. గొర్రెల పెంపకానికి రూ.4 వేల కోట్లు, చేపల పెంపకానికి రూ.1,000 కోట్ల రుణాలు సేకరించనుంది. వీరితో పాటు నాయిబ్రాహ్మణ, రజకులకు కలిపి రూ.500 కోట్లు, విశ్వకర్మలుగా పిలిచే ఐదు కులాలకు రూ.200 కోట్లు, చేనేతకు రూ.1,200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. 

బీసీల్లో అత్యంత వెనుకబడిన ఎంబీసీ వర్గాలకు రూ.వెయ్యి కోట్లు కేటాయించటం ఇదే తొలిసారి. మొత్తంగా సాగు నీటి రంగం తర్వాత సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించారు సీఎం కేసీఆర్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీల సంక్షేమానికి దాదాపు రూ.24 వేల కోట్లు కేటాయించారు. వీరితో పాటు బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు ప్రకటించారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్‌ పథకాలకు ఈసారి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. 

బడ్జెటేతర వనరులతో వీటిని చేపడతామని మాత్రం ప్రకటించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకే ఏకంగా రూ.7 వేల కోట్లు అదనంగా కేటాయించ‌టం విశేషం. ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ శాఖ కు భారీగా కేటాయింపులు పెరిగాయి. ప్రతి శాఖకు కూడా కనీసం రూ.2 వేల కోట్లకన్నా ఎక్కువ కేటాయింపులు ఉండడం గమనార్హం. నిర్వ హణ కేటాయింపులతో సంబంధం లేకుండా కేవలం ప్రగతి పద్దులను (గతంలో ప్రణాళిక వ్యయం) లెక్కలోకి తీసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. 

ఎస్సీ సంక్షేమ శాఖకు గత ఏడాది రూ.7,122 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 9902 కోట్లు కేటాయించారు. ఎస్టీ సంక్షేమ శాఖకు రూ. 3552 కోట్లు నుంచి 5719.33 కోట్లకు పెంచారు. బీసీలకు గత ఏడాది 2538 కోట్లు కేటాయిం చగా ఈ ఏడాది రూ. 4764.60 కోట్లు కేటాయించారు. అలాగే, కల్యాణ లక్ష్మికి గత ఏడాది 738 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 850 కోట్లకు పెంచారు. ఈ ఏడాది కొత్తగా ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం గమనార్హం. 

అలాగే, ప్రగతి పద్దులో వృత్తిదారులకు కేసీఆర్ అధిక ప్రా ధాన్యం ఇచ్చారు. ప్రధానంగా చేనేత చేయూతకు రూ.1200 కోట్లు, ఎంబీసీ కార్పొరేషనకు రూ.వెయ్యి కోట్లు, రజక, నాయీ బ్రాహ్మణులకు చేయూత ఇవ్వడానికి రూ.450 కోట్లు కేటాయించారు. నాయీ బ్రాహ్మణులు అత్యాధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి చేయూత ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్లో సాగునీటి రంగానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. స్కీం ఎక్స్‌పెండిచర్ లో సాగునీటి రంగానికి రూ.23,675.73 కోట్లు కేటాయించింది. మొత్తంమీద ఈసారి బ‌డ్జెట్‌లో మాత్రం కేసీఆర్ త‌న‌కో లెక్కుంద‌ని మాత్రం నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: