వైసీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలను ఓ అస్త్రంగా మార్చుకుంటున్నారు. సొంత జిల్లాలో జగన్ ను వీక్ చేస్తే.. మోరల్ గా, మెంటల్ గా వీక్ చేయవచ్చని చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మండలి ఎన్నికల్లో కడప జిల్లాపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 



జగన్‌కు కంచుకోటగా ఉన్న కడపలో పాగా వేసేందుకు తెలుగుదేశం వ్యూహరచన చేసింది. ప్రస్తుతం తమ శిబిరంలో ఉన్న  సంఖ్యా బలంతోనే కడప ఎమ్మెల్సీ స్థానాన్ని 
గెలవచ్చనే ధీమా ఆ పార్టీలో కనిపిస్తోంది. కడప ఓటర్ల కోసం పాండిచ్చేరిలో శిబిరం నిర్వహించిన తెలుగుదేశం. వారిని గురువారం జిల్లాకు తరలించింది. 



మండలి ఎన్నికల ఓట్ల కోసం కూడా ఓటర్లను ఇన్ ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యేక విమానంలో కడప తీసుకెళ్లారు. మిగిలిన వారిని ప్రత్యేక 
బస్సుల్లో జిల్లాకు తరలించారు. వైసీపీ మాత్రం తమ కంచుకోటకు ఢోకా లేదని చెబుతోంది. ఎందుకైనా మంచిదని ఈ పార్టీ కూడా తమ ఓటర్ల కోసం బెంగళూరులో క్యాంపు 
నిర్వహించింది. 



వైసీపీ తన ఓటర్లను గురువారం కడప, ఇడుపులపాయ, ఆకేపాడులకు తరలించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్, టీడీపీ ఎంపీ  సీఎం రమేశ్ జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు. పోటీ హోరాహోరీగా ఉండటంతో  సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల ఉండటం వల్ల 4000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద సీసీ కెమెరాలను అమర్చి... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: