సీఎం కేసీఆర్ గ‌త మూడేళ్ళ కాలంలో ఇచ్చిన హామీల‌ను దాదాపుగా వెన‌క్కు తీసుకుంటూ వ‌స్తున్నారు. సెక్ర‌టేరియ‌ట్ ను ఎర్ర‌గ‌డ్డ‌ను మారుస్తాన‌ని, ఉస్మానియా హ‌స్సిట‌ల్ ను న‌గర శివారు లోకి, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దాదాపు వాటిని ప‌క్క‌న పెట్టాడ‌నే చెప్పాలి. ఇక‌పోతే ఆయ‌న ఇవ్వ‌ని  హామీల‌ను మాత్రం చ‌క చ‌క పూర్తి చేస్తున్నారు. మిష‌న్ కాక‌తీయ‌,  మిష‌న్ భ‌గీర‌థ‌, పోలీసుల‌కు వేత‌నాల పెంపు, అంగ‌న్ వాడీలను జీతాలు పెంపు త‌దిత‌ర హామీల‌ను పూర్తి చేసేశారు. 


ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నేత సీనియ‌ర్ నాయ‌కులు జానారెడ్డి విమ‌ర్శాస్థ్రాలు సందంచారు.  గొర్రెలు , మేకలు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. మేపేందుకు భూమి లేదని, అందుకే ఇవ్వడం లేదని మరోసారి చెప్పే అవకాశం కూడా ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేక కొనుగోలు చేయడానికి భూమి లేనందున ఇవ్వడం లేదని అసెంబ్లీలో కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 

అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లోపంతో రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు.  కాంగ్రెస్‌ పార్టీ కార్య కర్తల ఆలోచన, ఆశించిన విధంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని జానారెడ్డి భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు వాటిని నెరవేర్చ కుండా మాయమాటలతో కాలం వెల్లబుచ్చుతోందని మండిపడ్డారు.

మ‌రి జానారెడ్డి చెప్పిన విమ‌ర్శ‌లు నిజ‌మైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఏ స‌మయంలో ఎలా స్పందిస్తారో తెలియ‌దు. ఆయ‌న ఇచ్చిన హామీలను దాదాపు ప‌క్క‌న పెట్టిన దాఖాలే ఎక్కువ గా ఉన్నాయి. ఇప్ప‌టికిప్పుడే గొల్ల కురుమ‌ల‌కు ఇవ్వ‌నున్న గొర్రెల పంపిణీ చేస్తాన‌ని తెల‌ప‌డం వాస్త వ‌మే. అయి తే వాటిని మేపేందుకు నిజంగా భూములు లేవ‌ని  గొల్ల కురుమ‌లు నిర్మోహ‌మాటంగా చెప్పేస్తు న్నారు. ఇప్ప‌టికే ఉన్న భూములు పూర్తిగా కబ్జాకు గురైయాయి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో సీఎ కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసు కుంటారో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: