నలుగురికీ నచ్చినది నాకసలు నచ్చదులే అనే తీరు సాక్షి టీవీ ని చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. గత కొద్ది గంటల క్రితం వెలువడ్డ ఎమ్మెల్సీ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వివేకానంద రెడ్డిపై బీటెక్ రవి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూస్ ఛానెల్స్ అన్నీ టీడీపీ ని ప్రశంసిస్తూ ఉంటే సాక్షి ఛానెల్ మాత్రం టీడీపీ అడ్డ దారిలో గెలిచిందని ప్రసారం చేయడం నిజంగా విడ్డూరం.


Image result for sakshi media

తన పార్టీ పరాభవం పై జగన్ స్పందిస్తూ సీఎం చంద్రబాబు అద్భుతంగా కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరి పోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అయితే జగన్ చేసిన ఈ ఆరోపణలపై అధికార పార్టీ భగ్గుమంది. ఓటమిని కూడా ఒప్పుకోని వైసీపీ పార్టీ ఒక పార్టీయేనా టీడీపీ నేతలు జగన్ పై, సాక్షి ఛానెల్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.


Image result for sakshi media

దేశంలో. రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులకు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయు కానీ, ఏ ఛానెల్ కూడా సాక్షిలా సొంత నాయకుడిని వేనుకేసుకొని రావడం మాత్రం పత్రికా విలువలకే అది అవమానంగా భావిస్తున్నారు పత్రికా రచయితలు. ఫలితాలు వెలువడే వరకు వివేకానంద రెడ్డి గెలుపు ఖాయమని సాక్షి ఛానెల్ విపరీతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: