తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు కోసం భేర‌సారాలాడి అడ్డంగా దొరికినా టీడీపీ వైఖరి మాత్రం మారలేదు. అదే సిద్దాంతాన్ని అమ‌లు చేసుకుంటూ ఏపీలో ఎదురులేని రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతుంది. ప్రతి పక్షాలకి ఏ మాత్రం తావివ్వకుండా చంద్రబాబు తన రాజకీయ కోణాన్ని చూపిస్తూ 2019లో కూడా తామే అధికారంలోకి వస్తున్నామని ఏపీ సీఎం చంద్ర‌బాబు గర్వాంగా చెబుతున్నారు. అయితే వైసిపి మాత్రం తన రాజకీయ చరిత్రలో ఇలాంటి ఓటములు ఎన్ని వచ్చిన లెక్క చేయబోమని బాబు డబ్బుతో రాజకీయం చేసిన సరే 2019 లో మేమె అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 


త‌న సొంత జిల్లా అయిన‌ కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ప‌ట్టు ఉన్నా ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోవడాన్ని జీర్ణిం చుకోలేక‌పోతుంది. పార్టీకి కంచు కోటలాంటి కడపలో కూడా టిడిపి విజయం తో కోలుకోలేని ఎదురు దెబ్బ తగల డంతో జగన్ పార్టీ నివ్వెర పోయింది. దాదాపు తమదే విజయం అనుకున్న జగన్ ఎంతో దైర్యం తో తన పెద నా న్నకి ఎమ్మెల్సీ సీటుని ఇచ్చారు. కానీ రాజకీయ తెలివిలో జగన్ తనకంటే చిన్నవాడని ఆ విజయంతో చెప్పకనే చెప్పాడు. ఇంతకు ముందు టిడిపికి తనదైన శైలిలో సేవలు చేసిన బీటెక్ రవి పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఛలోక్తిని ప్రదర్శించి టిడిపి తరపున విజయాన్ని అందించాడు. 

దాదాపు నువ్వా నేనా అని సాగిన కౌంటిగ్స్ లో 33 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఈ విధంగా వైసిపి కోటలో మొదటి జెండాను ఎగురవ వేసింది టీడీపీ. నెల్లూరులోను జగన్ తన ఉనికిని కోల్పోతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎంతో జాగ్రత్తగా దాదాపు 90% విజయం తమదే అనే కోణం లో జగన్ సెట్ చేసారని వార్తలు వినిపించాయి. రాజ కీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి పై 87 ఓట్ల మెజారిటీతో వాకాటి నారాయణ రెడ్డి గెలుపొందారు. కౌంటీగ్ ప్రక్రియ మొదలైన కాసేపటికే టిడిపి విజయం ఖరారయ్యింది. 

అసలు వైసిపి అభ్యర్థి ఎన్నిక విషయం లో కొంత తొందర పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత కు ముందు కొన్ని అధికార వ్యవస్థలో తీవ్ర విమర్శలను ఎదురుకున్న విజయ్ కుమార్ రెడ్డి ని ఎంపిక చేసినపుడే కొంత ఆలోచించమని జగన్ తో నాయకులూ మంతనాలు జరిపారట. కానీ జగన్ అత్యుత్సాహం వాళ్ళ ఓటమిని చూడాల్సి వచ్చింది అంటున్నారు ఆ పార్టీ లోని కొందరు నాయకులు. కానీ టిడిపి మాత్రం అధికార పక్షంలో ఉన్నది మేమె అన్నట్టుగా గుర్తు చేసినట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి.

ఇక కర్నూలు లో వైసిపి వేసిన వ్యూహ రచన ఏ మాత్రం ఫలించలేదని టిడిపి గెలిచినా తీరును బట్టి చూస్తే తెలు స్తుంది. చివరి వరకు పోరాడినా ఓటమిని చవి చూసింది వైఎస్సార్ పార్టీ. శిల్ప చక్రపాణిని ఎమ్మెల్సీ స్థానంలో నిలబెట్టి టిడిపి బారి విజయాన్ని నమోదు చేసుకొని వైసిపి అభ్యర్థి వెంకట్ రెడ్డి పై 56 ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. అయితే గత రెండు నెలలుగా జగన్ పార్టీ పై బారి అంచనాలతో బెట్టింగ్ లు కూడా అక్కడ జరిగాయి. టిడిపి విజయం పై ఆశలు వదులుకోవద్దని చంద్రబాబు వేసిన తీరును 100% తన అధికార బలం తో చూపించా రని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

అసెంబ్లీ వివాదం లో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న వైసిపికి ఈ ఎలక్షన్ గట్టి గుణపాఠాన్ని చూపించిందని టిడిపి నాయకులూ పెదవి విరుస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన ఓటమిని ఒప్పుకోవడానికి ఏ మాత్రం అంగీకరించటం లేదు. అంతే కాకుండా బాబు పై తీవ్ర విమర్శలు చేస్తూ 300 కోట్లకు పైగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు ఖర్చు చేసారని అయినా తమ పార్టీ గట్టి పోటీని ఇచ్చిందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: