వీసా ఎఫెక్ట్: భారతీయులకు రష్యా రెడ్ కార్పెట్


స్నెహితులు, పుస్తకాలు మరియు మధ్యం అవి ఎంత పాతవైతే అంత మృదుమధురం అంత మాధుర్యం. అలాగే దేశాల మధ్య స్నెహం కూడా! వజ్రం లాంటి కొత్త స్నెహి తుడు అదే అమెరికా మనకు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు చూపుతుంటే బంగారం లాంటి మన పాత మితృడు రష్యా మనకు చేయూత నివ్వటానికి ఎర్ర తివాచీ పరు స్తుంది. మన యువతరానికి పట్టుగొమ్మలా నిలవటానికి సిద్ధంగా ఉంది. ప్రశ్చన్న యుద్ధకాలములో మనలను ఎంతగానో దగ్గరకు తీసుకున్న రష్యా మరల అమెరికా జాత్య హంకారానికి మనయువత బలౌతున్న సమయము లో మీకు మేమున్నాం ఎప్పటిలా అంటూ చేయి చాపుతూంది. వజ్రం గొప్పదే దాన్ని పట్టిఉంచటానికి బంగారం ఎప్పుడూ అవసరమే. ఇప్పుడు వజ్రం జారిపడిపోయినా మనలనైనా పట్టుకొని నిలబెట్టగల బంగారం లాంటి స్నేహితుడు ఉత్సాహంగానే నిరీక్షిస్తున్నాడు.  


వీసాలో కఠినతరమైన నిబంధనలతో అమెరికా కంపెనీల్లో తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్న యువ భారత ఉద్యోగులకు ఇతర దేశాలు సాదరంగా ఆహ్వానాలు పలుకుతున్నాయి. కెనడా తర్వాత తాజాగా అమెరికాకు బద్దశత్రువైన రష్యా సైతం భారతీయులు వచ్చి తమ దేశంలో పనిచేసుకోవచ్చని పేర్కొంది. "భారత నైపుణ్యాలను" ను మాత్రమే తాము ఆహ్వానించడం లేదని, తమ దేశంలో "సౌకర్యవంతంగా, గౌరవంగా" నివసించే సాయం కూడా తాము అందిస్తామని రష్యా భరోసా ఇస్తోంది. అమెరికాలో వీసా మార్పులపై ప్రతిపాదనలు వెల్లువెత్తడం ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రష్యన్ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి డెనిస్ మన్టూరవ్ తెలిపారు.


Image result for russia welcomes indian skills

 
"భారతీయులకు రష్యా, స్వాగతం చెబుతోంది. ఎంతో ప్రతిభావంతులైన భారతీయులైన ఉద్యోగులకు రష్యా ఎప్పుడూ తలుపులు బార్ల తెరిచే ఉంచుతోంది.  రష్యాలో సెటిల్ అవడానికి సాయపడతాం. గణితానుభవజ్ఞులు, ఎక్కువ ప్రతిభకలిగిన ఉద్యోగులు కలిగి ఉండటంలో రష్యన్, భారతీయులే ప్రపంచంలో ఉత్తమోత్తమం. భారతీయులను స్వాగతించటానికి  రష్యా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది" అని మన్టూరవ్ చెప్పారు. ఈ రెండు దేశాలు కలిసి "బిజినెస్ వెంచర్లు" ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొంది ద్దామని పేర్కొన్నారు.


 
70 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు ఉత్సవాల్లో భాగంగా మాన్టూరవ్ భారత్ కు విచ్చేశారు. గత ఆరు నెలల్లోనే  ఈ రష్యన్ మంత్రిది రెండో పర్యటన ఇది. జూన్ 1 నుంచి 3 వరకు సెయింట్ పీటర్స్-బర్గ్ లో జరుగనున్న "ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్" కు భారత ప్రధాని నరెంద్ర మోదీని ఈయన ఆహ్వానించనున్నారు. అతిథిగా ప్రధాని అక్కడికి వెళ్లనున్నారు. ఈ "ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్" లో భారత్ సైతం అతిధి దేశం. 


Image result for old friend old wine old book hd images

మరింత సమాచారం తెలుసుకోండి: