వైసీపీకి చంద్రబాబు వార్నింగ్..


ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పరస్పర దూషణల పర్వం కొనసాగుతోంది. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదని స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. ప్రతిపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విపక్ష నాయకుల ప్రవర్తన సభలో హుందాగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అన్నా.. స్పీకర్ అన్నా విపక్ష సభ్యులకు గౌరవం లేదన్నారు. 


బాత్ రూంకు కూడా వెళ్లొద్దా: జగన్


ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది. ఓ సమయంలో జగన్ సభలో లేరు. ఆ తర్వాత ఆయన సభకు వచ్చారు. జగన్ సభలో లేకపోవడాన్ని యనమల ప్రశ్నించారు. దీనిపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. బాత్ రూంకు కూడా వెళ్లవద్దా అని అడిగారు. వెళ్లేటప్పుడు ఇలా చూపించి  వెళ్లాలని తనకు తెలియదన్నారు.


మీడియా పాయింట్ వద్ద టీడీపీ-వైసీపీ 'ఫైట్'

Image result for media point fight
వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న ఇరు వర్గాలు పోటాపోటీగా వాగ్వాదానికి దిగారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో ఆమె పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ తీరును తప్పుపట్టారు. అనవసర ఆరోపణలతో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు పార్టీల నేతలు మీడియా పాయింట్ వద్ద పోటాపోటీగా వ్యవహరించడంతో.. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితి గందరగోళ స్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. 


అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ...


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో సీట్ల పెంపు కోసం ప్రభుత్వం లేఖరాసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పెంపు వీలుకాదని స్పష్టంచేశారు. 


ముగిసిన మంత్రివర్గ సమావేశం...



తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి గురించి మంత్రివర్గంలో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరించారు. అభ్యుదయ, ప్రగతిశీల అంశాలతో ఈ బిల్లును రూపొందించినట్టు సీఎం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: