తెలుగులో ఒక సామెత ఉంది చీమలున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా..? అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఒకతను చీమలు తెగ ఇబ్బంది పెడుతున్నాయని తన ఉంటికే నిప్పు పెట్టాడు. ఈ ఘటన న్యూయార్క్‌లోని మైన్‌ నగరంలోని ఓల్డ్‌ ఆర్చర్డ్‌ బీచ్‌ ప్రాంతంలో జరిగింది.  డెవోన్‌ డౌసెట్‌ అనే వ్యక్తి తన తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఆ ఇంటి బేస్‌మెంట్‌లో చీమలు పుట్టలు పెట్టాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అక్కడి నుంచి తరిమేయడం సాధ్యం కాలేదు.


చీమలున్నాయని ఇంటికి నిప్పుపెట్టాడు..!

అయితే ఎలాగైనా సరే వీడి బెడద పోగొట్టుకోవాలని భావించిన అతను బేస్‌మెంట్‌ వద్ద ఉన్న చీమల పుట్ట చుట్టూ కొద్దిగా మంట పెట్టాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పక్కనే ఉన్న చెత్తకు అంటుకుని ఇంటి మొత్తానికి వ్యాపించాయి. అలా ఇళ్లు మొత్తం తగలబడిపోయింది. అయితే ఆ ఇంట్లో నుంచి కొన్ని విలువైన వస్తువులను బయటకి తెచ్చే క్రమంలో ఆతనికి గాయాలు కూడా అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు.


Image result for ants

ఇళ్లును కోల్పోవడంతో ఆ యువకుడు దానికి సంబంధించిన సమాచారాన్ని, ఫోటోలను ఫండ్ వెబ్ సైట్లలో పెట్టడంతో అతనికి సహాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. ఇప్పటివరకూ పది వేల డాలర్లు విరాళాల రూపంలో పొగయ్యాయి. డబ్బుతో పాటు ఆ కుటుంబానికి అవసరమయ్యే కొన్ని వస్తువులను కూడా కొందరు సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: