స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో  దాదాపు మూడు కోట్లు  డ‌బ్బులు ఖ‌ర్చు చేసి వక్రమార్గాన గెలుపొందిన అధికార తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అక్రమ మార్గంలో గెలుపొందడానికి ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను జనం గట్టిగా తిప్పికొట్టారు. 


2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో అధికార పార్టీని ప్రజ లు తిరస్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పట్టభద్రులు, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలోనూ టీడీపీ పరాజయం పాలైంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, పశ్చిమ రాయలసీమ స్థానంలో ఓటమి అంచున నిలిచారు. ఉత్తరాంధ్ర (విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం) స్థానంలో ఆ పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పీడీఎఫ్‌ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీలో ఉన్నారు. 

5 ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికలు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగాయి. నాలుగు జిల్లాలు మినహా రాష్ట్ర మంతా ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంది. ఉపాధ్యాయ, పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు బరితె గించారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. షరా మామూలుగానే రూ. కోట్లు వెదజల్లారు. అంతేకాకుండా రిగ్గింగ్‌కూ పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్య మంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వయంగా ఆయా జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. 

సీఎం సొంత జిల్లాలోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ పరిస్థితి స్పష్టం గా కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు గుమ్మరించి ప్రత్యర్థి ఓటర్లను కొనుగోలు చేసి గెలి చినందుకు సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు మంగళవారం నోరు మెదపలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయం వరకు సభలోకి రాకుండా తన గదికే పరిమితమైపోయారు. కొద్దిసేపటికి సభలోకి వచ్చినా రుసరుసలాడుతూ ప్రతిపక్షంపై అకారణంగా విరుచుకుపడ్డారు. 

మరోవైపు అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచిన
ప్ప‌టికీ, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మం త్రులే అంగీకరిస్తున్నారు. ‘‘మా పని అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇలాం టి ఫలితాలు తప్పవు. ఇది గమనించే మా అధినేత ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను కూడా ఏదో ఒక సాకు చూపించి, నిలిపివేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మొత్తంమీద ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘోరం ప‌రాభ‌వం చ‌విచూసింద‌ని తెలపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: