వై.ఎస్. జగన్ మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడు దినపత్రిక ఊసు ఎత్తారు. జగన్ నోట ఈనాడు పదం విని చాలా రోజులైంది. మంగళవారం జగన్ ఆస్తుల అంశంపై కొద్దిసేపు గొడవ జరిగింది. విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లలో అవకతవతకలు జరిగాయని వైసీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించడం ఈ గొడవకు దారి తీసింది. 


తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎక్కువ ధరకు విద్యుత్ కొంటోందని.. ఇందులో కోట్లు రూపాయలు ముడుపులు అందాయని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు లేచి.. మీ దగ్గర లక్షల కోట్లు సొమ్ము ఉంది కదా.. టెండర్లు వేయండి.. మీకే ఇస్తామని సవాల్ విసిరారు. ఈ సమయంలో చర్చ జగన్ ఆస్తులపైకి మళ్లడం వేడెక్కించింది.


తన ఆస్తుల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని జగన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి సాక్షి గురించి లెక్కలు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈనాడు నష్టాల్లో ఉన్నా.. దాని షేరు వేలల్లో చూపారని.. అలాగే సాక్షి షేర్ కూడా వేలల్లో ఉందని.. చెప్పుకొచ్చారు. ఈనాడులో, కానీ సాక్షిలో కానీ వాటాలు కొన్నవారు ఏమాత్రం నష్టపోలేదని జగన్ వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: