హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఓ వైపు కృషి చేస్తుంది..మరోవైపు నేర సామ్రాజ్యం కూడా విసృతంగా పెరిగిపోతుంది.  ఇప్పటికే రియల్ దందాలు, గన్ కల్చర్, పబ్ కల్చర్, చైన్ స్నాచింగ్స్, కిడ్నాప్స్ ఇలా ఎన్నో రకాలుగా నేరాలు పెరిగిపోతున్నాయి.  తాజాగా ఓ ఐఏఎస్ అధికారి తన కొడుకు చేసిన తప్పు కప్పి పుచ్చడానికి వేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో తండ్రీ కొడుకులు కటకటాల పాలయ్యారు.  మూడు రోజుల కిందట హైదరాబాద్‌లో కారు డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు.
Driver murder: IAS officer and son arrested
అనుక్షణం అనేక మలుపులు తిరిగింది ఈ కేసు.డ్రైవర్ నాగరాజు, ఐఏఎస్ కొడుకు వెంకట్ సుక్రూల మధ్య జరిగిన గొడవే డ్రైవర్ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా ఐఏఎస్ వెంకటేశ్వర్లును గడిచిన 24 గంటలుగా పోలీసులు విచారణ చేశారు. విచారణ అనంతరం ఐఏఎస్ వెంకటేశ్వర్లుతో పాటు అతని కొడుకు సుక్రూను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు కేసు వివరాలను వెల్లడించారు.   డ్రైవర్ నాగరాజు, ఐఏఎస్ కొడుకు సుక్రు మధ్య అసహజ సంబంధం ఉందని తెలిపారు.
Image result for డ్రైవర్ నాగరాజు హత్య
ఇద్దరు ఫుల్‌గా మద్యం తాగారు.. అనంతరం స్వలింగ సంప్కరం వ్యవహారంపై ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుక్రుత్ డ్రైవర్ తలపై బలంగా కొట్టడం, అతడు కింద పడిపోయాడు. భయపడిన సుక్రుత్‌, అక్కడి నుంచి పరారయ్యాడు. ఐతే, కంగారులో బైక్‌ తాళాలు అక్కడే వదిలేయడంతో మళ్లీ అదేరోజు రాత్రి 11.30 గంటలకు మళ్లీ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. శవాన్ని మాయం చేస్తే కొడుకు ఈ కేసు నుంచి బయటపడే ఛాన్స్ వుందని భావించాడు ఐఏఎస్ అధికారి. శవాన్ని అక్కడికి తీసుకెళ్లి అదృశ్యం చేయాలని అనుకున్నారు.
Image result for డ్రైవర్ నాగరాజు హత్య
శనివారం రాత్రి వెంకటేశ్వరరావు, కారులో కొడుకును తీసుకుని యూసుఫ్‌గూడ కి వెళ్లాడు. శవాన్ని తీసుకు వచ్చే క్రమంలో శబ్ధం రావడంతో అపార్ట్ మెంట్ వాసులు వీరిని అడ్డుకోవడంతో సుక్రూ అక్కడ నుంచి పారిపోయాడు..వెంటనే తండ్రి కూడా చిన్నగా తన కారులో అక్కడ నుంచి వెళ్లిపోయాడు.  శవాన్ని గమనించిన అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం తెలపడంతో  పోలీసులు డ్రైవర్ నాగరాజు డెడ్‌బాడీ అని గుర్తించడం జరిగిపోయింది. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కూడా రంగప్రవేశం చేశారని, సీసీపుటేజ్‌లో ఆయన కూడా కనిపించడంతో ఆయనను కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: