భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ కథానాయకుడు, ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాధ్ ను అభిమానించే వాళ్ళే కాదు అసహ్యించుకునే వాళ్ళు ఎక్కువే. అందుకే ఈయన తొలి నుండి వార్తా పత్రికల ప్రియుడే. సామాజిక మీడియా ద్వారా ఆయనపై అనేక విషయాలు ప్రాచుర్యములోకి వస్తూనే ఉన్నాయి. అందులో ఆయనకు గౌరవం ఆపాదించేవి పరువు తీసే వార్తా విశేషాలతో పాటు అలవిమాలిన అశ్లీలం పొంగి పొరలే చిత్రాలు అనేకం కనిపిస్తాయి. మంచి చెడూ  రెండూ కలగలసి ఉంటాయి.


ఏదేమైనా ఈయన ఉత్తరప్రదేశ్ లో అత్యంత ప్రజాకర్షణగల వ్యక్తి కాబట్టే, ఈయన్ని బిజెపి ముఖ్యమంత్రిగా నిలిపింది అదీ ప్రభంజన విజయానంతరం. దీన్ని బట్టే నమో తరవాతి స్థానం ఈ యోగి దే అంటారు.  అత్యంత వివాదాస్పదమైన ఈ యోగిపుంగవుడు వివాదాల వలననే ప్రజలకు దగ్గరయ్యాడు. ముస్లింల పట్ల చాలా కఠినమైన వ్యాఖ్యలు చేయటం, వ్యవహరించటం లాంటి విషయాలు, ఆయన ప్రజాకర్షణను పలుచన చేయటమూ జరుగుతుంది. 


అయితే ఆయనకు చెందిన ఇక అశ్లీల చిత్రం సామాజిక మీడియాలో వైరల్ గా దూసుకు పోవటం ఆయన ప్రాభవం పై ధారుణ ప్రభావం చూపుతుంది. వనితా లోలత్వంతో ఒక మహిళ వద్ద జారత్వం చూపిస్తూ మరీ దిగజారుతున్నట్లున్న ఒక నీలిచిత్రం వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేయబడుతుంది. అయితే ఈ చిత్రం మార్ఫింగ్ చేయబడిందని, 19 సంవత్సరాల ముంబై కుర్రాడు దీనికి కారణమని అంతర్గత వర్గాల సమాచారం. ఆ కుర్రాణ్ణి ముంబై పోలీసులు అరెష్ట్ చేశారని సమాచారం కూడా ప్రచారములో ఉంది. నిజానిజాలు దైవాదీనాలనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: