సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా కొద్దీ మనుషుల ఆలోచనలు వింత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఆదివారం సాయంత్రం షాపుకు వెళ్లిన తన కూతురు ను కొందరు కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. సోషల్ మీడియా లోచుస్తే గానీ ఆ తల్లికి ఈ విషయం తెలిసి రాలేదు. ఆ మూర్ఖులు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడమే కాక ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ పట్టి మరీ అఘాయిత్యానికి ఒడిగట్టారు.  ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.



ఆదివారం సాయంత్రం షాపుకు వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగి రాలేదని బాలిక తల్లి స్టేసీ ఎల్కిన్స్ ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులు లైవ్ వీడియో చూసి తనకు సమాచారం ఇచ్చినట్టు స్టేసీ ఎల్కిన్స్ పోలీసుల ఎదుట వాపోయింది.  40 మంది వరకు ఈ లైవ్ వీడియోను చూసి కూడా.. 911కు డయల్‌ చేయకపోవడం చాలా బాధాకరం అని చికాగో పోలీసు విభాగం అధికారప్రతినిధి ఆంటోనీ తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులను చూస్తూ కూడా ఒక్కరూ పట్టించుకోలేదు.


ఫేస్ బుక్ లైవ్లో బాలికపై గ్యాంగ్ రేప్

ఏ మాత్రం బాధ్యతగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు.  ఫేస్ బుక్ పేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పేజీ వివరాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాలికను కూడా ప్రశ్నిస్తున్నారు. ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: