ధైర్యం ఉందా బాబూ... ప్రజల దగ్గరకెళ్దాం : వైఎస్ జగన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మరోసారి సవాలు చేశారు. ''ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి, అడ్డగోలుగా డబ్బులు గుమ్మరించి పరోక్ష ఎన్నికల్లో నాలుగు ఓట్లతో మూడు సీట్లు గెలిచినంత మాత్రాన గొప్ప విజయంగా చెప్పుకొంటున్న చంద్రబాబుకు మరోసారి సవాలు విసురుతున్నా... దమ్ము, దైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలి'' అన్నారు.


చంద్రబాబుకు మొహం చూపించలేకపోతున్నా: కేఈ


కర్నూలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మెజారిటీ సాధించి ఉంటే బాగుండేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. అనుకున్న మెజారిటీ రాకపోవడంతో ముఖ్యమంత్రికి మొహం చూపించలేకపోతున్నామని పేర్కొన్నారు. మెజార్టీ అంశంలో శిల్పా చక్రపాణిరెడ్డి మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ ముందున్న అతిపెద్ద టాస్క్‌ కర్నూలు కార్పోరేషన్‌ ఎన్నికలని.. ఆ ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పనిచేస్తామన్నారు. 


చంద్రబాబు గిఫ్ట్, రూ.20 లక్షల కారు రూ.9 లక్షలకే! 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ యువతకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉపాధిలో భాగంగా రూ.20 లక్షల కారును అతి తక్కువ ధరకే ఇస్తున్నారు.చంద్రబాబు తన కార్యాలయం వద్ద దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాలను పంపిణీని ప్రారంభించారు. ఏపీ షెడ్యూల్ కులాల ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 222 క్యాబ్స్ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.


ఏడాది చివరికల్లా మెట్రో పరుగులు!


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ నగర ప్రజలకు ఒక తీపివార్త. ఈ ఏడాది చివరిలోగా హైదరాబాద్ లో మెట్రోరైల్‌ పరుగులు పెట్టనుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతగా రద్దీ ఎక్కువగా ఉండే రెండు కారిడార్లలో మొత్తం 56 కిలోమీటర్ల మేర మైట్రో రైల్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందులో మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు 27 కిలోమీటర్ల మెట్రో మార్గం డిసెంబర్ నాటికి నగరవాసులకు అందుబాట్లోకి తేనున్నట్టు చెప్పారు.


ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు


హైదరాబాద్‌ నగరంలో జరిగిన డ్రైవర్‌ నాగరాజు హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితుడు వెంకట్‌ సుక్రు తండ్రి ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు బుధవారం పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు వెంకట్‌ సుక్రును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వెంకట్‌ తప్పు చేశాడని ఒప్పుకున్నారు. కానీ, తనకు నాగరాజు హత్యతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. డబ్బు ఇవ్వకపోవడంతో తనపై కూడా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. కేసును విచారిస్తున్న ఉన్నతాధికారులతో పాటు నగర కమిషనర్‌ సీపీ మహేందర్‌రెడ్డిని విచారించాలని డిమాండ్‌ చేశారు



మరింత సమాచారం తెలుసుకోండి: