ఓవైపు సొంత జిల్లాలో కడపలో వైఎస్ జగన్ కు పరాభవం ఎదురైంది.. స్వయంగా సొంత చిన్నాన్నే అక్కడ ఓడిపోయాడు.. దశాబ్దాలుగా పట్టున్న సొంత జిల్లాపై జగన్ పట్టుకోల్పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ సమయంలో కూడా వైఎస్ జగన్ పట్టరాని సంతోషంతో ఉన్నారు. మిగిలిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు ఆయన్ను ఆనందంలో నింపేశాయి.


వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ. కొంత మంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొనేస్తే సరిపోతుంది. మేనేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ. కానీ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వీటి ప్రభావం చాలా తక్కువ. లక్షల సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పుడు ఎంతమందిని కొనగలరు. ఈ కారణంతోనే వైఎస్ జగన్ చాలా హ్యాపీగా ఉన్నారు. 


మొత్తం నాలుగింటిలో మూడు వైకాపాకు, వైకాపా మధ్దతు ఇచ్చిన వారు విజయం సాధించారు. దీంతో చదువుకున్నవారు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగులు తమ వెంటే ఉన్నారని జగన్ కు నమ్మకం కుదిరింది. రేపు సాధారణ ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన విశ్వాసాన్ని ఈ ఎన్నికలు ఇచ్చాయని ఆయన ఖుషీ అవుతున్నారు. విలేకరులతో మాటామంతీలోనూ ఆ ధైర్యం కనిపించింది. 


అనంతపురం పట్టభద్రుల స్థానం సహా నాలుగుచోట్ల తాము గెలిచామని, చదువుకున్న వారంతా తమకే ఓటు వేశారని జగన్ అంటున్నారు. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాయని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు పాల్పడ్డారని, కోట్లు వెచ్చించి ప్రజాప్రతినిధులకు భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. టీడీపీలో చేర్చుకున్న వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని జగన్ మరోసారి సవాల్ విసిరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: