ప్రస్తుతం మార్కెట్లో బైక్  కొనాలంటే కనీసం 60 వేలు పెట్టంది అయితే రాదూ. సరే.. 60 వేలు పెట్టి కొంటె అదేహి ఇచ్చే మైలేజ్ లీటర్ 50 కిలోమీటర్లు. రాను రాను ఇంకా తగ్గుతుందే కానీ పెరిగే ప్రసక్తే లేదు. యువత ఇంకా కొంచెం స్టైలిష్ మోడల్ బైక్ కావాలనుకుంటే గనుక అక్షరాలా లక్ష సమర్పించుకోవాల్సిందే. లక్ష పెట్టినా అది ఇచ్చే మైలేజ్ కేవలం లీటర్ కి 50 కిలోమీటర్లే. కానీ ఒక యువకుడు 25 వేల రూపాయలకే లీటరుకి 80 కిలో మీటర్లు మైలేజీ ఇచ్చే  బండిని సృష్టించాడు. వంశీకుమార్‌ నివాసం ఉండేది చిత్తూరు జిల్లా కొర్లగుంట.



నాన్న అనిల్‌కుమార్‌ ఆటోడ్రైవర్‌. అమ్మ మంజుల గృహిణి. అన్న, నేను, చెల్లెలు. చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్‌ సౌండ్స్‌ అంటే ఇతడికి ఇష్టం. ఆ సౌండ్‌ వచ్చేందుకు ఇంజన్‌, సైలన్సర్ల పనితీరును పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌ వచ్చే బైక్‌ను తయారు చేయాలనుకున్నా. బైక్‌ ఎలా ఉండాలనుకున్నానో మొదటి బొమ్మను గీశా. అందుకు అవసరమైన స్పేర్‌పార్ట్స్‌ను తయారు చేయించా.


Image result for small bikes

ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించి 110సీసీ  ఇంజన్ తీసుకుని, కార్బేటర్‌లో కొన్ని మార్పులు చేసి మినీ బైక్‌ను తీసుకొచ్చా. దీనికి రూ.60 వేలు ఖర్చయింది. ఎక్కువ సంఖ్యలో బైక్‌ తయారు చేయాలంటే రూ.25 వేలు చాలు. తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్స్ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నా. కోస్తా ప్రాంతం నుంచి వంద బైక్‌లు కావాలన్నారు. అందుకు కావాల్సిన రవాణాశాఖ ఇతరత్రా ప్రభుత్వ అనుమతుల కోసం అన్వేషిస్తున్నానన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: