ఓటుకు నోటు కేసు విషయంలో మరోసారి చంద్రబాబు నోరు విప్పారు. ఆంధ్రా అసెంబ్లీలో ఓటుకు నోటు కేసుపై స్పందించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించి తన రాజకీయ జీవితాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకున్నారు. ఈ సమయంలోనే వైసీపీ తనపై బురద జల్లుతోందని చంద్రబాబు ఆరోపించారు. అప్పుడే ఓటు కు నోటుపైనా స్పందించారు. 


ఓటుకు నోటు కేసులో అసలు విషయం ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఆ చట్టం దీనికి వర్తించదని కోర్టు చెప్పిందన్నారు. హైకోర్టు ఈ విషయంలో అసలు తప్పే జరగలేదని స్పష్టంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా వారు తనపై బురద జల్లేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. అక్కడ లీవ్ పిటీషన్ ను అలో చేసేరు అంతే అధ్యక్షా అంటూ చంద్రబాబు అన్నారు. 


అసలు 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చిన జగన్ లాంటి వ్యక్తులు తన గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పేశారు. తాను లీగల్ లా ఎక్కడా తప్పు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. తాను టెక్నికల్ గా దొరకకూడదని చాలా జాగ్రత్తపడతానని చంద్రబాబు చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం ఇక్కడ గమనించాల్సి ఉంది. 


అసలు తాను ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించలేదని.. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని.. చంద్రబాబు స్పష్టం చేయలేకపోయారు. రేవంత్ రెడ్డికి సొమ్ములు ఇచ్చి పంపిన విషయాన్ని కావాలనే వదిలేశారు. ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయాక.. తప్పు చేయకపోతే.. ఆ గొంతు తనది కాదని చెప్పాలి కదా.. ఆ మాట చెప్పకుండా ఇక చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్ముతారా..!? 



మరింత సమాచారం తెలుసుకోండి: