ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీని పగబట్టిందా..? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటుకు ముందు పచ్చ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభ సజావుగా జరగదానికి పచ్చ పార్టీ ఎమ్మెల్యేలైన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేసింది.


Image result for trs tdp

అయితే దీనిపై టీడీపీ నేతలు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి టీడీపీ అంటే భయం అందుకే అసెంబ్లీ నుండి మమ్మల్ని సస్పెండ్ చేసిందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. టీఆర్ఎస్ కు టీడీపీ అంటే భయమని, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను సభలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని,


Image result for revanth reddy

ప్రజాస్వామ్యానికి విరుద్దంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రత్యక తెలంగాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసాడో అందరికీ తెలిసిందే. అందుకే ఓటుకు నోటు కేసులో కేసీఆర్ పకడ్బందీగా వ్యవహరించి అటు రేవంత్ రెడ్డిని. ఇటు చంద్రబాబు బుక్ చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: