వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీని కమలం పార్టీలో కలుపుతున్నారని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వార్తలు హల చల్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ కమలం పార్టీతో జత క్కలిసి అధికారంలోకి రావడానికి జగన్ మోడ్ తో  మంతనాలు జరుపుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయినా జగన్ ఎందుకు మోడీని కలుస్తారు..? ఎందుకు పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారు..? ఇవన్నీ వట్టి కల్పితాలే అని కొందరు కొట్టిపారేస్తున్నా..ఇలా ఎందుకు జరగకూడదు..?


Image result for jc diwakar reddy

రాజకీయాల్లో ఎలాంటి మార్పులైనా సంభవించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయం జేసీ దివాకర్ రెడ్డి కి చేరింది. ఇక ఆయన ఊరుకుంటాడా..? జగన్ ని కడిగి పారేసాడు. . సీఎం పదవి ఇస్తానని బీజేపీ కనుక హామీ ఇస్తే, జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధపడతాడని, అందులో ఎటువంటి అనుమానం లేదని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.


Image result for jc diwakar reddy

వైసీపీ ని బీజీపీ లో విలీనం చేయాలంటే మోడీ ముందుగా బాబుతో దోస్తీ కట్ చేసుకోవాలి. కానీ మోడీ అందుకే సిద్ధంగా లేరని, అలా జరిగే అవకాశమే లేదని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. జనసేన పార్టీ పరిధి పరిమితంగా ఉందని, దాని నుంచి బయటపడితే గానీ ఆ పార్టీకి భవిష్యత్ ఉండదని అన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పవన్ కల్యాణ్ నమ్ముకున్నారని జేసీ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: