పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడు ఫంక్షన్ లో ఎవరి స్పీచ్ హై లిఘ్త అయ్యింది అంటే అందరూ బండ్ల గణేష్ , త్రివిక్రమ్ అని చెప్పరు ఖచ్చితంగా టీవీ 9 రవి ప్రకాష్ అనే చెబుతారు. టీవీ 9 రవి ప్రకాష్ ఎన్ టీవీ ఓనర్ నరేంద్ర చౌదరి తో కలిసి ఈ వ్యవహారం లో పాల్గొన్నారు. ఈ చిత్రం తో పాటు పవన కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కూడా బాగా పోగిడేసిన రవి ప్రకాష్ ఈ ప్రోగ్రాం కి ఎందుకు విచ్చేశారు , పవన్ ని ఎందుకంత పొగిడేశారు అనే ప్రశ్నలు చాలానే ఉదయించాయి. ఆ సినిమాకి మీడియా భాగస్వాములు గనక పెద్దలు ఇద్దరూ వచ్చారు అనుకోవచ్చు అయితే వీరిద్దరి కలయికా పవన్ తో కలిసి ఒక కొత్త ఛానల్ ని ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది అని మీడియా డిస్కషన్ లలో బయట పడుతోంది.


ఎంటీవీ తో కలిసి టీవీ9 కూడా ఒక ఛానల్ పెడితే మీడియా లో తమ ఆధిఖ్యత కి తిరుగు ఉండదు అని ఫీల్ అవుతున్నారట నరేంద్ర చౌదరి. టీవీ 9 ఎలాగూ నెంబర్ 1 కాబట్టి వారితోనే ఈ అడుగు వెయ్యాలి అనేది ఆయన ప్లాన్. ఏబీయెన్ చంద్రబాబు కి డబ్బా కొట్టడం లో ఎలాగూ బిజీ కాబట్టి , ఈనాడు మరో విధంగా రెండు రాష్ట్ర సర్కార్లకే గాక మోడీకి కూడా భజన చేస్తుండడం వల్ల ఎవరికి వారు తమ మార్గమేమిటో చూసుకోవలసిన స్థితి ఏర్పడింది.


ఎన్టీవీ టీవీ9 కలయిక ఆ నేపథ్యంలోంచే వచ్చిందంటున్నారు. అయితే వీరు మొదలు పెట్టేది న్యూస్ ఛానల్ కాదు , అదొక మ్యూజిక్ ఛానల్ అంటున్నారు. ఎన్టీవీ ప్రాంగణం లోనే ఇది స్టార్ట్ చేస్తారు, ఇది ఖరారు చేయడానికి రవి ప్రకాశ్‌ వారానికి ఒకటి రెండు సార్లు ఎన్‌టివిని సంరదర్శిస్తున్నట్టు సమాచారం. టీవీ 9 షేర్ లు అమ్మకానికి ఉన్నాయ్ అనీ త్వరలో నే ఈ అమ్మకం జరుగుతుంది అనీ చెబుతున్నారు , ఇంకా ఏ విషయం ఫైనల్ అయినట్టు కనపడ్డం లేదు.


రవిప్రకాష్ వాటాలు ఆయనకి ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉంటె బెటర్ అనేది రవి ఆలోచన. అందుకే టీవీ 9 తరవాత అంతగా బలం ఉన్న ఎన్టీవీ తో కలుస్తున్నారు ప్రకాష్ . మధ్యలో పవన్ లాంటి ఫాలోయింగ్ ఉన్న కొత్త నాయకుడిని ఎంకరేజ్ చేస్తే ఛానల్ కి ఫ్రీ పబ్లిసిటీ కదా అని వారి ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: