సాధారణంగా ఎలుకలు పంట చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు (బొర్రలు) చేయడం నిలువ ఉంచిన ధాన్యం పాడు చేయడం లాంటివి. ఇళ్ళల్లో  ఎలుకలు చెక్కలకు సైతం రంధ్రాలు చేయగలవు. ఉట్టిపై కూరగాయలు నాశనం చేయడం, పెట్టెలలో పెట్టిన బట్టలను కొరికి తినడం చేస్తుంటాయి.  ఎలుకలలో చిన్నవాటిని చిట్టెలుకలు అని పెద్ద వాటిని చుంచెలుకలు అని అంటారు.  అయితే ఇది వినాయకుని వాహనంగా పూజలందుకుంటుంది. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.

ఇక నాగపూర్ లో ఎలుకలు చేసిన పనికి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.  అక్కడ ఎలుకలు ఏకంగా 25 కిలో గంజాయిని బుక్కెశాయట..? ఇది ముమ్మాటికి ఎలుకలు చేసిన పనే అంటున్నారు  నాగపూర్ పోలీసులు. వినడానికి విడ్డూరంగా వుంది కదూ! మరి పోలీసుల మాటలకు పైస్థాయి అధికారులు ఏమన్నారు? అసలు గంజాయి‌ని ఎలుకలు తినడమేంటి? అనుకుంటున్నారా.
Image result for liquor bottles police seize
అసలు విషయానికి వస్తే..ఐదేళ్లుగా రైళ్ల సోదాల్లో భారీ మొత్తంలో గంజాయిని నాగపూర్ పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. భారీస్థాయిలో లిక్కర్‌ని సీజ్ చేశారు. ఆ మొత్తానికి ఓ గొడౌన్‌లో భద్రపరిచారు. అక్కడ ఎలుకల బెడద చాలా ఉందట..గోదాంలో స్టోర్ చేసిన గంజాయిలో 25 కిలోలను ఎలుకలు తినేశాయన్నది పోలీసులు ఆరోపిస్తున్నారు.  

అంతే కాదు  అవి చేసే హడావిడికి లిక్కర్ బాటిళ్లు సైతం కింద పడి లిక్కర్ ఆవిరైపోయిందట. అయితే ఇదంతా నిజమే అని నమ్మేశారు ఉన్నతాధికారు. అంతే కాదు ఆ గోదాముల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆర్డర్ వేశారు. మరి ఈ సీసీ కెమెరాలకు ముద్దాయిలైన ఎలుకలు చిక్కుతాయో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: